సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా అందరికి పరిచయమనున్న బర్రెలక్క ఉరఫ్ శిరీష తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అందరూ ఆమె గురించి మట్లాడుకునేలా చేసింది. కర్రే శిరీష కన్నా బర్రెలక్క గానే ఫేమస్ అయిన శిరీష రాజకీయాల్లో పోరాడి ఓడింది. సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలతో పాటుగా యువతకు పనికొచ్చే ఎన్నో వీడియోస్ ని పోస్ట్ చేసే బర్రెలక్క పెళ్లి పీటలెక్కబోతుంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త విపరీతంగా వైరల్ అయ్యింది.
అప్పటినుంచి శిరీష ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, ఆ వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు అంటూ అందరూ తెగ ఆరాలు తీస్తున్నారు. తాజాగా కర్రే శిరీష తనకి కాబోయే భర్తని పరిచయం చేసింది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ని ఈ నెల 28 న వివాహం చేసుకోబోతుంది. ఆ మేరకు వెంకటేష్ ఫొటోస్ ని అలాగే తమ ఎంగేజ్మెంట్ వీడియో ని కూడా షేర్ చేసింది.
అలాగే వెంకటేష్ తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్న బర్రెలక్క ఈ మార్చ్ 28 న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. వెంకటేష్ MSC ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. MLA గా పోటీ చేసి ఓడినా తాను ఇపుడు ఎంపీ గా కూడా పోటీ చెయ్యబోతున్నట్టుగా చెప్పింది. తాను ఎలక్షన్స్ లో పోటీ చేసే యువతని మేలుకొలిపేందుకే అంటూ చెప్పుకొచ్చింది.