కల్కి 2898AD పోస్ట్ పోన్ అవుతుంది అని సోషల్ మీడియాలో ఒకటే మొత్తుకుంటున్నారు. మే 13 ఎలక్షన్స్ కారణంగా ఈసారి వైజయంతి మూవీ మేకర్స్ ప్లాన్స్ వర్కవుట్ అవ్వవు, వారి సెంటిమెంట్ డేట్ కి కల్కి 2898AD ని తీసుకొద్దామనుకుంటే.. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి పడ్డాయి. అందుకే కల్కి పోస్ట్ పోన్ అనేది అనివార్యమంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కల్కి మేకర్ కామ్ గా ఉన్నారు.
ఆ అనౌన్సమెంట్ ఏదో అంటే కల్కిని అఫీషియల్ గా పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటించి.. ఆ కొత్త తేదీ ఏదో ఇస్తే ప్రభాస్ ఫాన్స్ కూడా కూల్ అవుతారు. లేదంటే కల్కి రాక గురించి వారిలో ఆందోళన పెరుగుతుంది తప్ప తగ్గదు. మరోపక్క కల్కి పోస్ట్ పోన్ కి ఒక్క ఎలక్షన్స్ మాత్రమే కారణం కాదు, కల్కి సిజి వర్క్ పెండింగ్ ఉంది అంటూ కనిపిస్తున్న వార్తలతో ప్రభాస్ అభిమానులు మరింత అప్సెట్ అవుతున్నారు.
మరి ఇలాంటి వార్తలకి చెక్ పెట్టాలంటే కల్కి మేకర్స్ మౌనాన్ని వీడి.. ఆ కొత్త డేట్ జులై లేదా ఆగష్టు కాదు అక్టోబర్ దసరా కి ఇలా ఏదో ఒక కొత్త తేదీ అనౌన్సమెంట్ ఇస్తే బావుంటుంది.