Advertisementt

ఈషా రెబ్బ సూపర్ కూల్ లుక్

Tue 26th Mar 2024 07:23 PM
eesha rebba  ఈషా రెబ్బ సూపర్ కూల్ లుక్
Eesha Rebba looks super cool ఈషా రెబ్బ సూపర్ కూల్ లుక్
Advertisement
Ads by CJ

తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పద్దతిగా కనిపించిన ఈషా రెబ్బా కి అందం, అణుకువ అన్నీ ఉన్నా అవకాశాలే తలుపు తట్టలేదు. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ బ్యూటీని పట్టించుకోలేదు. వరసగా సినిమాలు చేసినా బ్రేకిచ్చే ప్రాజెక్ట్ ఏది దొరక్కపోవడంతో ఈషా రెబ్బ వెనుకపడిపోయింది. పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టి గ్లామర్ అవతారమెత్తినా పని జరగడం లేదు. పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది అనుకున్నట్టుగా ఉంది ఈషా రెబ్బ పని.

ఈమధ్యన జెడి చక్రవర్తితో కలిసి నటించిన దయా వెబ్ సీరీస్ హిట్ అయ్యింది, దానికి పార్ట్ 2 రావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాలు చేతిలో లేకపోయినా వెబ్ మీడియాలో బిజీగా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ పాప తాజాగా వదిలిన ఫోటో షూట్ చూస్తే వావ్ ఈషా ఇంతందమెక్కడ దాచేసావ్ అంటారు. రెడ్ కలర్ మోడ్రెన్ డిజైనర్ అవుట్ ఫిట్ లో ఈషా రెబ్బ లుక్స్ కూల్ అనేలా అందంగా కనిపించింది. ఏదో వెడ్డింగ్ కి వెళుతుందా అనేలా ట్రెడిషనల్ గా ఆమె అవుట్ ఫిట్ ఉంది.

రెడ్ అవుట్ ఫిట్ లుక్స్ లో ఈషా రెబ్బా అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈషా లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Eesha Rebba looks super cool:

Eesha Rebba new photoshoot goes viral

Tags:   EESHA REBBA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ