Advertisementt

నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?

Wed 27th Mar 2024 03:10 PM
nani and srikanth odela  నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?
Again Movie in Nani and Srikanth Odela Combo నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?
Advertisement
Ads by CJ

గత ఏడాది నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో మాస్ యాక్షన్ చిత్రంగా వచ్చిన దసరా ప్యాన్ ఇండియాలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపిన దసరా కలెక్షన్స్ మిగతా భాషలలో అంత ప్రభావితం చూపలేకపోయాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా శ్రీకాంత్ ఓదెల దసరాకి మాస్ గా ప్రెజెంట్ చేశాడు. నాని-దీక్షిత్-కీర్తి సురేష్ ల మధ్యలో ప్రేమ, షైన్ టామ్ చాకో విలనిజం అన్ని దసరా చిత్రంలో హైలెట్ అయ్యాయి. శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టయిల్ కి అందరూ ఫిదా అయ్యారు.

ఆ తర్వాత నాని హాయ్ నాన్న అంటూ కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత సరిపోద శనివారం సిద్ధం చేస్తున్నాడు. మరోపక్క నాని బలగం వేణు తోనూ, అలాగే సుజిత్ తోనూ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల మాత్రం దసరా తర్వాత ఏ హీరోకి కమిట్ అవ్వలేదు. నాని కాంబోలోనే శ్రీకాంత్ మూవీ చేస్తాడనే ప్రచారం ఉంది. ఇప్పుడు అది నిజమైంది. నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో మూవీ పట్టాలెక్కేందుకు సిద్దమవుతుంది.

అయితే అది దసరాకి సీక్వెల్ అని కొందరు, కాదు అది దసరాకి సీక్వెల్ ఎంత మాత్రమూ కాదు ఫ్రెష్ స్టోరీతోనే శ్రీకాంత్ ఓదెల నాని మూవీ డైరెక్ట్ చేస్తున్నాడని కొందరు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు. మరి అది దసరాకి సీక్వెలా.. లేదంటే ఫ్రెష్ స్టోరీనా అనేది తెలియాల్సి ఉంది.

Again Movie in Nani and Srikanth Odela Combo:

Nani and Srikanth Odela Combo Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ