Advertisementt

బర్రెలక్క పెళ్లి - మోగుతున్న భాజాలు

Wed 27th Mar 2024 04:54 PM
barrelakka aka sirisha  బర్రెలక్క పెళ్లి - మోగుతున్న భాజాలు
Barrelakka Aka Sirisha wedding news బర్రెలక్క పెళ్లి - మోగుతున్న భాజాలు
Advertisement
Ads by CJ

తెలంగాణ ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కెసిఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్యన ఎంతగా వార్ జరిగిందో, అది మీడియాలో ఎంతగా హైలైట్ అయ్యిందో ఆ ఎన్నికల్లో బర్రెలక్క ఉరఫ్ కర్నే శిరీష పేరు ఎంతగా మార్మోగిందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం తెగ ఫేమస్ అయ్యింది. అందుకే ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ పాపులర్ అవుతోంది అనుకుంటే సడెన్ గా అతి పెద్ద న్యూస్ తో భారీ షాక్ ఇచ్చింది బర్రెలక్క. 

తన ఇన్ స్టాగ్రామ్ ఫాల్లోవర్స్ అందరికీ సర్ ప్రైజింగ్ న్యూస్ ని రివీల్ చేస్తూ పెళ్లి విషయాన్ని వెల్లడించింది శిరీష. అదీ రేపే (28-03-2024) అంటూ.! అంతే కాదు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియో ని కూడా షేర్ చేయడం విశేషం. కాగా శిరీష పెళ్లి సందడి ఇప్పటికే మొదలైపోయింది. నేడు ఘనంగా జరుగుతోన్న హల్దీ వేడుకలో పెళ్లి కూతురిగా ముస్తాబై మెరిసిపోయింది శిరీష. 

ఇక రేపు వెలువడే తన పరిణయ వేడుక ఫొటోస్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నెటిజన్లు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టడం తృటిలో మిస్ అయినా, ఇపుడు వివాహ బంధం లోకి అడుగిడుతున్న శిరీష కు ఆమెను అభిమానించే వారందరి తరపునా శుభాభినందనలు.! 

 

Barrelakka Aka Sirisha wedding news:

Barrelakka Aka Sirisha wedding celebrations 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ