శ్రీరామనవమి వచ్చేస్తుంది.. మరి జై హనుమాన్ పై ప్రశాంత్ వర్మ అప్ డేట్ రెడీ చేస్తున్నాడా, అంజనాద్రి 2.0 అంటూ వీడియో వదిలి అందరిలో విపరీతమైన అంచనాలు కలిగిచిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అప్ డేట్ లేదా ఫస్ట్ లుక్ తో శ్రీరామనవమి రోజున అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని నమ్ముతున్నారు. వచ్చే బుధవారమే శ్రీరామనవమి.
మరి నవమి అప్ డేట్ ఉంటే.. ఇప్పటికే జై హనుమాన్ ముచ్చట సోషల్ మీడియాలో మొదలైపోయేది. కానీ అదేమీ కనిపించడం లేదు. అంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కి సంబందించిన అప్ డేట్ ఇవ్వడం లేదా అనే అనుమానం మొదలైంది.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంటున్న ప్రశాంత్ వర్మ అంజనాద్రి 2.0 వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
జై హనుమాన్ ఫస్ట్ లుక్ తో ఇంకెత అంచనాలు క్రియేట్ చేస్తాడో.. హనుమాన్ కి సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే జై హనుమాన్ లో స్టార్ హీరో ఎవరు నటిస్తారు, ఏ క్రేజీ హీరోని ప్రశాంత్ వర్మ దింపుతున్నాడో అనే ఆసక్తి అందరిలో కాదు కాదు పాన్ ఇండియా ఆడియన్స్ లో ఉంది. మరి శ్రీరామనవమికి జై హనుమాన్ లుక్ లేకపోయినా.. ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో చూద్దాం.