ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కి ఉరుములేని వర్షంలా హనుమాన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తుఫాను కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ప్రశాంత్ వర్మ ఆ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టయిల్ కి, గ్రాఫిక్స్ కి పడిపోని ప్రేక్షకుడు లేడు. హనుమాన్ ని మళ్ళీ మళ్ళీ థియేటర్స్ లో వీక్షించిన యూత్ ఆ చిత్రం ఓటీటీలోకి రాగానే మరోసారి వీక్షించారంటేనే ప్రేక్షకులు ఎంతెలా హనుమాన్ ని ఎంజాయ్ చేసారో అర్ధమవుతుంది.
హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ అంటూ ప్రకటించిన ప్రశాంతవర్మ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో అనే ఆత్రుతలో పాన్ ఇండియా ప్రేక్షకులు కనిపిస్తున్నారు. అయితే శ్రీరామనవమి పండుగ సందర్భంగా జై హనుమాన్ అప్ డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అప్ డేట్ ఇచ్చాడు.
హనుమాన్ కంటే మరింత అద్భుతంగా జై హనుమాన్ తో ఎప్పటికి గుర్తుండిపోయే అనుభూతిని మీకు అందిస్తాను అని శ్రీరామ నవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ హనుమాన్ నుంచి ప్రీ లుక్ వదిలారు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే జై హనుమాన్ కథ రెడీ అయ్యింది. ఎలా తియ్యలి, ఏ స్టార్ హీరో అయితే సెట్ అవుతారో అనే విషయంలో ప్రశాంత్ వర్మ తన టీం తో కలిసి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.