పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ సృష్టించింది. మాస్ మూవీగా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మర్కెట్ లో సలార్ కి భీభత్సమైన క్రేజ్ తీసుకురావడం, ప్రభాస్ పై ఉన్న అంచనాలు, పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కనిపించడం అన్ని సలార్ ని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసాయి. ఇప్పుడు సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న కల్కి 2898 ADపై కూడా పాన్ ఇండియా మర్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల కల్కి థియేట్రికల్ హక్కులపై క్రేజీ బిజినెస్ నడుస్తూ ఉండగా.. ఇప్పుడు హిందీ మర్కెట్ లో కల్కి కి పలుకుతున్న రేటు చూసి అందరూ షాకైపోతున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కల్కి 2898 AD కి 75 కోట్లు డబ్బింగ్ రైట్స్ కోసం కోట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది సౌత్ ఫిలిమ్స్ అన్నిట్లో హైయ్యెస్ట్ రేట్ అంటున్నారు. ఈ డీల్ ఫినిష్ అయితే.. హిందీ రైట్స్ విషయంలో కల్కి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసినట్లే అంటున్నారు.
అయితే కల్కి కి ఈ రేంజ్ రేటు పలకడానికి కారణం అమితాబచ్చన్, హీరోయిన్స్ దీపికా పదుకొనె, దిశా పాటనీలు కూడా కారణం అవ్వొచ్చని, బాహుబలి తో ప్రభాస్ కొచ్చిన పేరు ఏ మాత్రం తగ్గలేదు అని కల్కి మరో మారు నిరూపిస్తుంది అంటున్నారు.