కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి హీరో నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తున్నాడు. శ్రీకాకుళం జాలరి పేట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎక్కువగా సముద్రంలోనూ, అలాగే సముద్ర తీర ప్రాంతంలోనే ఉంటుంది. ఈమధ్యనే హైదరాబాద్ లో స్పెషల్ జైలు సెట్ వేసి తండేల్ చిత్రాన్ని అందులో చిత్రీకరిస్తున్నారు. అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్.
గతంలో విడుదలైన తండేల్ గ్లిమ్ప్స్ ఈ చిత్రం పై అంచనాలు మరింతగా క్రియేట్ అయ్యేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యింది. ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చుకుంటూ చక చకా షూటింగ్ ని చుట్టేస్తున్న చందు మొండేటి తండేల్ చిత్రాన్ని దసరా బాక్సాఫీసు బరిలో నిలుపుతాడు, పాన్ ఇండియా మూవీస్ కి ధీటుగా ఈచిత్రాన్ని దించుతాడనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం చందు మొండేటి, నాగ చైతన్య డిసెంబర్ లో అందులోను క్రిష్టమస్ సెలవులపై కన్నేశారు అని తెలుస్తోది.
తండేల్ చిత్రాన్ని డిసెంబర్ 20 న విడుదల చేసే ఆలోచనలో ఉండడం కాదు.. ఆల్మోస్ట్ తండేల్ ని డిసెంబర్ 20 నే విడుదల చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యి త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యబోతునట్టుగా తెలుస్తోంది. సో డిసెంబర్ లో క్రిష్టమస్ సెలవలపై కన్నేసిన మొదటి చిత్రం తండేల్. అప్పటికి ఇంకెన్ని పోటీకి వస్తాయో చూడాలి.