Advertisementt

కల్కి ఎవ్వరు అందుకోలేనంత ఎత్తులో..

Mon 22nd Apr 2024 11:39 AM
kalki 2898ad  కల్కి ఎవ్వరు అందుకోలేనంత ఎత్తులో..
Kalki : Amitabh fierce glimpse amazes కల్కి ఎవ్వరు అందుకోలేనంత ఎత్తులో..
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కలయికలో క్రేజీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న కల్కి 2898AD  చిత్రం విడుదలపై ఆందోళన పడి మేకర్స్ ని కంగారు పెట్టడం సరికాదు అని.. నిన్న ఆదివారం రాత్రి అమితాబ్ పాత్ర పరిచయ వీడియో సోషల్ మీడియాలో సృస్తిస్తున్న ప్రకంపనలు చూస్తే అర్ధమవుతుంది. నాగ్ అశ్విన్ కల్కి ని ఎలా చూపిస్తాడో అని అందరిలో చాలా ఆత్రుత ఉంది. 

నాగ్ అశ్విన్ అమితాబ్ వీడియోతోనే కాదు ప్రభాస్ భైరవ లుక్ తో కల్కి రేంజ్ తెలియజేసారు. అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర పరిచయ వీడియో చూసాక కల్కి ఎవ్వరు అందుకోలేనంత ఎత్తులో ఉంది.. అంచాలు ఆకాశంలో కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. నిన్న ఆదివారం కల్కి నుండి రిలీజ్ డేట్ అప్ డేట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినా.. అమితాబ్ లుక్ తో ప్రభాస్ ఫాన్స్ ని కూల్ చేసారు. కల్కి రిలీజ్ డేట్ ముఖ్యం కాదు అవుట్ ఫుట్ ముఖ్యం అని ఈ వీడియో ద్వారా కల్కి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 

కల్కి 2898 AD రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మే, జూన్, జూలై ఈ మూడు నెలలో నాలుగు తేదీల ఆప్షన్స్ పెట్టుకున్నారట మేకర్స్. ఫైనల్ గా ఏ తేదీ అనేది త్వరలనే అధికారిక ప్రకటన ఇస్తారని తెలుస్తోంది. 

Kalki : Amitabh fierce glimpse amazes:

Kalki 2898AD: Amitabh intese as immortal Ashwatthama

Tags:   KALKI 2898AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ