తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలొస్తున్నాయంటే.. రాజకీయ పార్టీలే కాదు.. సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల పరంగా పదవులనాశించి ఒక్కో రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తూ ప్రచారం గట్రా నిర్వహిస్తారు. మరికొంతమంది వ్యక్తులపై ఉన్న అభిమానంతో ప్రచారానికి వస్తారు. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా కనిపిస్తుంది. సినిమా వాళ్ళెవరూ ఈ ఎలక్షన్స్ లో రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేసే ఉద్దేశ్యంలో కనిపించడం లేదు.
నందమూరి బాలకృష్ణ గతంలోలా హిందుపూర్ నుంచి ఎమ్యెల్యేగా పోటీ చేస్తున్నారు, ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ పోటీ చేస్తున్నారు. ఆయనకి సపోర్ గా జబర్దస్థ్ లో కొంతమంది కమెడియన్స్ బయలు దేరారు. ఇక నగరి నుంచి నటి రోజా మరోసారి ఎమ్యెల్యే గా పోటీ చేస్తున్నారు. ఆమెకీ ఎవరి సపోర్ట్ లేదు.
ఇక నటుడు పృథ్వీ జనసేనకు సపోర్ట్ చేస్తుంటే.. అలి, పోసాని లాంటి వాళ్ళు వైసీపీ కి కొమ్ముకాస్తున్నారు. అలీ వైసీపీ నుంచి ఎమ్యెల్యే టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఇక పోసాని వైసీపీ పదవిని అనుభవిస్తూ సినిమా ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అయితే మెగాస్టార్ చిరు తమ్ముడు జనసేన పార్టీకి భారీ విరాళమిచ్చినా ఆయన ప్రచారానికి దూరం.
బిజెపి కాండిడేట్స్ సీఎం రమేష్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యమని వీడియో వదులుతున్నారు. మురళి మోహన్ లాంటి వాళ్ళు రాజకీయాలకి దూరంగా వెళ్లిపోయారు. అసలు ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ ఈ ఎలక్షన్స్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.