పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతోనే ట్రావెల్ చేస్తూ జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా మారిన విజయవాడ పోతిన మహేష్ కి జనసేన పార్టీ నుంచి విజయవాడ టికెట్ దక్కకపోయేసరికి.. వెంటనే వైసీపీ లోకి జంప్ అయ్యి ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమే కాదు.. అయన భార్య విషయంలోనూ మహేష్ అదే మాట్లాడుతున్నాడు. జనసేనలో ఉన్నప్పుడు పార్టీ మారితే నా తల తెగ్గొట్టుకుంటా అని చెప్పిన మహేష్ ఆ తర్వాత వైసీపీ లో జోయ్ అయ్యి పవన్ ని ఆయన ఫామిలీ ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా మహేష్ పోతిన పవన్ కళ్యాణ్ కి ఓపెన్ లెటర్ వ్రాసాడు.
1. మెగా కుటుంబానికి అభిమానులు దగ్గరనుంచి అన్ని తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు మెగా కుటుంబంలో జరిగిన ఏ ఒక్క శుభకార్యానికి అయినా అభిమానులకి ఏనాడైనా ఒక ఇస్తరాకులో ప్లేటు భోజనమైన పెట్టారా? శుభకార్యాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో పెట్టి వ్యాపారం కూడా చేసుకుంటారు. కాని పిఠాపురానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మీరు ప్రజలకి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మరియు కాపు యువతకి ఎప్పుడూ ఏమి చేయరు వాళ్ళ అడ్డం పెట్టుకొని అన్ని సంపాదించుకుంటారు.
2. పవన్ కళ్యాణ్ గారు తమరు 5 సంవత్సరాలుగా తమరు వినియోగిస్తున్న ప్రత్యేక విమానం మరియు హెలికాప్టర్ ఖర్చుల గురించి ఎన్నికల అఫిడివిట్ లో ఎందుకు చూపులేదు. ఇవి మీ సొంతమా ?లేక మీ బినామీల ద్వారా కొనిపించి వాడుతున్నారా? అద్దెకు తీసుకొని చెల్లింపులు చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నారా?విమాన రంగంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వాటాలు ఉన్నాయా? ఒక బినామీ కంపెనీ ద్వారా తమరు కొనుగోలు చేసి అందులో డైరెక్టర్ గా వినయ్ మరియు విశ్వప్రసాదులను నిమకం చేశారా? సామాన్య మధ్యతరగతికి (ఈమధ్య ఉపన్యాసాల్లో చెబుతున్నారు) చెందిన మీరు ప్రత్యేక విమానాల్లో నిరంతరం ప్రయాణించేంత లగ్జరీ జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?
3. కాపు సామాజిక వర్గం వారికి చెందిన prime 9 ఛానల్ రఘువీర్ గారికి తమరు ఎందుకు విలువనివ్వరు.
అదేవిధంగా 99 tv ఛానల్ తోట సత్యనారాయణ గారికి, NO - 1 ఛానల్ సుధాకర్ నాయుడు గారికి ఏనాడైనా మీరు సరైన రీతులో మద్దతు ఇచ్చారా? కాపు సామాజిక వర్గం వారు ప్రారంభించిన ఈ చానల్స్ కి తమరు ఎందుకు అండగా నిలవలేదు. తమరికి కొన్ని వేరే చానల్స్ పై మహాప్రేమ ఎందుకో. కాపు సామాజిక వర్గం వారు ఏర్పాటుచేసిన చానల్స్ ని తమరు ఎందుకు ఎదగనివ్వరు?
4. దాతలు మరియు NRI లు ఇంకా చాలామంది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విరాళలు ఇచ్చారు వారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేదు కానీ మీ అన్న చిరంజీవి గారి దగ్గర తీసుకున్న చెక్కుని గదిలో తీసుకోవచ్చు కదా ఎందుకు ప్రచారం చేశారు ?
5. తమరు ప్రతి 10 -15 రోజులకి ఫోన్ నెంబర్లు ఎందుకు మారుస్తారు? దానికి కారణం ఏంటి? తమరి దగ్గర ఏ నెంబరు ఒకటి స్థిరంగా ఉండదంట కదా? కారణాలేంటి గతం తమరిని వెంటాడుతుందనా లేక అభద్రతాభావమా?
6. ఎన్నికల ప్రచారంలో భాగంగా
పులివెందులలో YS భారతి గారు,
కుప్పంలో భువనేశ్వరి గారు,
మంగళగిరిలో బ్రాహ్మణి గారు,
మరి పిఠాపురంలో............?
యూ టూ.....ఛీ నా బతుకు చెడ