మార్చ్ 27 న సిద్దార్థ్-అదితి రావు లు తెలంగాణ లోని ఓ పురాతన ఆలయంలో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న విషయం మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. ఎవ్వరికి తెలియకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు కాబట్టి అందరూ సీక్రెట్ ఎంగేజ్మెంట్ అనుకున్నారు. ఆ విషయాన్ని అదితి-సిద్దార్థ్ లు ఓ పిక్ ని రిలీజ్ చేస్తూ ఎంగేజ్మెంట్ విషయాన్ని రివీల్ చేసారు.
అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని బయటపెట్టడానికి ఓ కారణముంది అంటుంది అదితి రావు. అందరూ తమ జీవితాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని ఎప్పటికి గుర్తుండిపోయే ప్రదేశంలో చేసుకోవాలి అనుకుంటారు. అలాగే నేను మా నిశ్చితార్ధాన్ని ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో చేసుకోవాలనుకునే.. మా ఫ్యామిలికి ఎంతో ఇంపార్టెంట్ అయిన 400 ఏళ్ళ నాటి గుడిలో చేసుకున్నాను. ఆ గుడితో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధమే ఉంది.
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ తర్వాత మా అమ్మ కోరిక మేరకే ఆ ఫోటోని బయటపెట్టి మా నిశ్చితార్ధపు విషయాన్ని అందరితో పంచుకున్నాను. మా వివాహం గురించి తెలుసుకోవాలని చాలామంది మా అమ్మకి ఫోన్ చేసేవారు. ఆ విషయంలో మా అమ్మ చాలా ఇబ్బంది పడింది. ఈ నిశ్చితార్ధం విషయం మీడియాకి చెప్పమని మా అమ్మే కోరింది. అందుకే వెంటనే మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని బయటపెట్టాను..అంటూ చెప్పుకొచ్చింది.