నిన్న మే 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాలుగు సినిమాల్లో కాస్త క్రేజ్ ఉన్న హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ. నారా రోహిత్ ప్రతినిధి 2 తో వచ్చినా పెద్దగా పబ్లిసిటీ లేకుండా వచ్చాడు. అది పొలిటికల్ థ్రిల్లర్ గా నిలవగా, సత్యదేవ్ కృష్ణమ్మ మాస్ మూమెంట్స్ తో కనిపించింది. ఇక మరో రెండు సినిమాలు ఆరంభం, డబ్బింగ్ మూవీ సత్య.. ఈ రెండు విడుదలైనా ఈ రెండు చిత్రాలని ప్రేక్షకులు పట్టించుకోలేదు.
సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ చిత్రానికి ఆడియన్స్ నుంచే కాదు, ఇటు క్రిటిక్స్ నుంచి కుల మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాల కొరతతో బోర్ ఫీలవుతున్న ప్రేక్షకులు.. మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమాలని ఎంజాయ్ చేసే మూడ్ లో కనిపించడం కృష్ణమ్మ కి కలిసొచ్చేలా ఉంది.
ఇక ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ డీల్ తో అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసినట్లుగా మేకర్స్.. టైటిల్ కార్డ్స్ లోనే రివీల్ చేసేసారు. కృష్ణమ్మ సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.