Advertisementt

వైసీపీకి ఇది షాకే

Sun 12th May 2024 12:15 PM
ycp leaders  వైసీపీకి ఇది షాకే
This is a shock for YCP వైసీపీకి ఇది షాకే
Advertisement
Ads by CJ

గత రెండు నెలలుగా ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ప్రజల మధ్యలోనే కనిపించాయి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి, కూటమికి సపోర్ట్ గా పీఎం మోడీ కూడా ఏపీలో కనిపించారు. అయితే ఇప్పుడు ఈ రెండు నెలల ప్రచారం ఒక ఎత్తు. రేపు ఎన్నికలు జరిగే సమయం అంటే నిన్న, ఈరోజు రాజకీయనాయకులకు మరో ఎత్తు. ఎందుకంటే ప్రచారం ఎంత చేసినా ఓట్లు పడతాయో లేదో తెలియదు. 

అందుకే ఈ రెండు రోజులు డబ్బు, మద్యం పారిస్తే ఓట్లు గుద్దేస్తారని.. చాలామంది తమ నియోజక వర్గాల్లో ఓటర్లకు డబ్బు ఆశ చూపించడం, మద్యం పొయ్యడం చేసి ఓటు వేయించుకుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చీరలని పంచారు. కానీ ఆ చీరలని.. అక్కడి ప్రజలు తిరిగి ఆ వైసీపీ నాయకుల ఇంట్లోకే విసురుతున్న ఘటన వైరల్ గా మారింది. 

వైసీపీ నేతలు మరీ నాసిరకం చీరలు పంచడంతోనే స్థానికులు ఆగ్రహించి ఆ చీరలని ఆ నేతల ఇళ్లలోకి విసురున్న వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన చాలామంది 100, 200ల చీరాలని మహిళలు ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. యూట్యూబ్ వచ్ఛాక ఆ చీరాల రేటంతో అర్ధమైపోతుంది. పిఠాపురంలోలా 5000 రూపాయల పట్టు చీరలు ఇస్తే మహిళలు వైసీపీకి ఓటేసేవారేమో అంటూ కామెడీగా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పేలా లేదు. 

This is a shock for YCP:

YCP leaders who distributed sarees were people who shocked the leaders

Tags:   YCP LEADERS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ