మెగా మనవరాలు క్లిన్ కారా దర్శనం కోసం మెగా అభిమానులే కాదు చాలామంది ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఏడాది జూన్ లో మెగా స్టార్ కి వారసురాలు, మెగా హీరో రామ్ చరణ్ కి కుమార్తె జన్మించింది. అప్పటి నుంచి మెగా వారసురాలిని చూపించకుండా చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈమధ్యన రామ్ చరణ్-ఉపాసనలు తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు క్లిన్ కార మొహాన్ని ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించారు.
తాజాగా మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన తల్లి అలాగే కూతురు క్లింకార తో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. నా జీవితాన్ని చాలా ప్రత్యేకమైన దానిగా చేసినందుకు క్లిన్ కారాకి ధన్యవాదాలు, నా మొదటి మాతృదినోత్సవం ❤️❤️❤️❤️❤️❤️ అనుభవం అద్భుతం, @shobanakamineni @anushpala మొదటి మదర్స్ డే శుభాకాంక్షలు.. అంటూ ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ గా మరింది.
ఆ ఫొటోలో క్లారిటీగా క్లిన్ కారా ఫేస్ కనిపించకపోయినా.. ఉపాసన క్లిన్ కారా ని ఎత్తుకుని ఉన్న పిక్ కావడంతో దాన్నే మెగా ఫాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.