Advertisementt

జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో తీవ్ర విషాదం

Thu 16th May 2024 11:02 AM
kevvu karthik  జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో తీవ్ర విషాదం
Deep tragedy in the house of Jabardasth comedian జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయ్యి అటు పేరుకి పేరు, ఇటు డబ్బు డబ్బు సంపాదించుకుంటూ కమెడియన్స్ గా పాపులర్ అయిన చాలామంది వెండితెర మీద కూడా వెలిగిపోతున్నారు. హీరోలుగా, సపోర్టింగ్ కేరెక్టర్స్ లో కనబడుతూ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న కెవ్వు కార్తీక్ తల్లి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. గతంలో కార్తీక్ జబర్దస్త్ స్టేజ్ పైన, ఇతర కార్యక్రమాల్లో తన తల్లి క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్నట్టుగా చెప్పాడు, ఆ తర్వాత ఆమె పలు కార్యక్రమాల్లో కాస్త ఆరోగ్యంగా కనిపించేసరికి అందరూ ఆమె క్యాన్సర్ తో కోలుకుంది అనుకున్నారు. 

కానీ ఐదు నెలలుగా ఆమె క్యాన్సర్ తిరగబెట్టడంతో చికిత్స పొందుతూ కన్ను మూసింది. దానితో కార్తీక్ కన్నీటి పర్యంతమవుతూ సోషల్ మీడియాలో తల్లి మరణం గురించి పోస్ట్ పెట్టాడు. అమ్మ.. గత 5 సంవత్సరాల 2 నెలలుగా కాన్సర్‌పై అలుపెరుగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడవు. అమ్మ ఈ ఐదేళ్లలో ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు అంటూ చెప్పుకోకోహ్హడు. 

అదే పోస్టులో అమ్మా.. నీ ఆత్మస్తర్యం నాలో ధైర్యాన్ని నిపింది. అన్ని నేర్పవు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ? తన కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం అంటూ చేసిన పోస్ట్ చూసి అభిమానులు కార్తీక్ కి అండగా పోస్ట్ లు పెడుతున్నారు. 

Deep tragedy in the house of Jabardasth comedian:

Jabardasth comedian Kevvu Karthik mother passed away due to cancer

Tags:   KEVVU KARTHIK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ