Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

Wed 22nd May 2024 05:39 PM
chaitanya krishna  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్
Chaitanya Krishna mass warning to NTR fans ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్
Advertisement
Ads by CJ

నందమూరి హీరోల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు స్టార్ స్టేటస్ ని మైంటైన్ చేస్తుంటే.. కళ్యాణ్ రామ్ అటు నిర్మాతగా, ఇటు హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఒకప్పుడు హీరోగా కనిపించిన తారకరత్న రీసెంట్ గానే చనిపోయారు. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను నటించిన బ్రీత్ సినిమా నందమూరి అభిమానులని నిరాశపరిచింది. 

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే చైతన్య కృష్ణ తాజాగా తన ఫేస్ బుక్ హ్యాండిల్ నుంచి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇచ్చిన మాస్ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా కొడాలి నాని ఎన్టీఆర్ ఫాన్స్ మీట్ లో పాల్గొని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టీడీపీ కి ఓటెయ్యొద్దు, టీడీపీ గెలిస్తే ఎన్టీఆర్ కి అన్యాయం జరుగుతుంది. టీడీపీ గెలిస్తే ఎప్పటికి అది ఎన్టీఆర్ చేతుల్లోకి రాదు, అలోచించి ఓటెయ్యమని అన్నాడు. దానితో ఎన్టీఆర్ అభిమానులు చాలామంది వైసీపీ కి సపోర్ట్ చేశారనే ప్రచారం జరిగింది. 

అందులో భాగంగానే చైతన్య కృష్ణ సోషల్ మీడియా వేదికగా..  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నా వార్నింగ్. ఎవరైతే గత ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీకి సపోర్ట్ చేశారో వాళ్లకు మాత్రమే. మీరు నిజంగా వాళ్లకు సపోర్ట్ చేశారని అంటున్నారు. కానీ, మీరెవరూ మా బొచ్చు కూడా పీకలేరు. 

అంతేకాకుండా నేను ఉండగా చంద్రబాబు మావయ్య,  బాలకృష్ణ బాబాయిని టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లతో కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. మీ అందరికీ చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు నందమూరి ఫ్యామిలిలో కలకలం సృష్టించిగా రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 

Chaitanya Krishna mass warning to NTR fans:

Nandamuri Chaitanya Krishna Serious Warning To Jr NTR Fans

Tags:   CHAITANYA KRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ