Advertisementt

అల్లు అర్జున్ తో యానిమల్ బ్యూటీ స్టెప్స్

Thu 23rd May 2024 01:20 PM
tripti dimri  అల్లు అర్జున్ తో యానిమల్ బ్యూటీ స్టెప్స్
Animal Beauty steps with Allu Arjun అల్లు అర్జున్ తో యానిమల్ బ్యూటీ స్టెప్స్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ తో యానిమల్ డ్యూటీ త్రిప్తి దిమ్రి నటించే ఛాన్స్ ఉంది అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అయితే అది పుష్ప ద రూల్ లోనా.. లేదంటే సందీప్ వంగ చిత్రంలోనా అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ తో త్రిప్తి దిమ్రి కన్ ఫర్మ్ అంటున్నారు. అయితే అది రొమాన్స్ లో కాదు.. జస్ట్ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కాలు కదిపే అదృష్టాన్ని కొట్టేసిందట ఈ బ్యూటీ. 

సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ మ్యూజిక్ లో పుష్ప ద రైజ్ లో సమంత తో ఐటెం సాంగ్ చేయించారు. ఇప్పుడు పుష్ప ద రూల్ లో ఏ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయిస్తారో అనే విషయంలో అటు చిత్ర బృందం, ఇటు మ్యూజిక్ లవర్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఈ విషయంలో చాలామంది హీరోయిన్స్ పేర్లు సుకుమార్ పరిశీలించారు,

తాజాగా యానిమల్ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని అందరి చూపు తనవైపు తిప్పుకున్న త్రిప్తి దిమ్రి అయితే అల్లు అర్జున్ సరసన ఐటమ్ సాంగ్ లో బావుంటుంది అని సుకుమార్ భావించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరిగే రామోజీ ఫిలిం సిటీలోనే ఈ స్పెషల్ సాంగ్ ని తెర‌కెక్కించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

మరి అల్లు అర్జున్ తో త్రిప్తి దిమ్రి గ్లామర్ గా కాలు కదిపితే అభిమానులకి, మ్యూజిక్ లవర్స్ కి పూనకాలే అంటూ అప్పుడే అల్లు ఫాన్స్ సంబరపడిపోతున్నారు. 

Animal Beauty steps with Allu Arjun:

Tripti Dimri to shake leg with Allu Arjun

Tags:   TRIPTI DIMRI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ