వైసీపీ అధికారంలోకి వస్తే.. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక జగన్ మంత్రివర్గంలో ఎవరు ఉంటారు..? పాత కేబినెట్ నుంచి ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉంది..? కొత్తగా ఎవరిని తీసుకుంటారు..? లక్కీ ఛాన్స్ ఎవరికీ రావచ్చు..? అనే దానిపై గట్టిగానే చర్చ జరుగుతోంది. కాసేపు ఆ విషయాలు అటుంచితే.. నగరి నుంచి రోజా గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లే. ఫైర్ బ్రాండ్ అంటే గుర్తొచ్చే ఈమెకు ఏం పదవి దక్కుతుంది..? అసలు ఈసారి ఏదో ఒక పదవి ఇచ్చే ఉద్దేశం జగన్ రెడ్డికి ఉందా.. లేదా? ఒకవేళ ఇస్తే ఏం పదవి ఇవ్వొచ్చు..? వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో కార్యకర్తలు, రోజా వీరాభిమానులు ఏం చర్చించుకుంటున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
రోజాకు ఏం ఇవ్వొచ్చు..?
వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని...ఇప్పటికే ఇందుకు సంబంధించి వైజాగ్ వేదికగా ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తక్కువలో తక్కువ 100 నుంచి 125 వరకూ అసెంబ్లీ సీట్లలో గెలుస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఇప్పటివరకూ వై నాట్ 175 నుంచి.. ఈ పరిస్థితి వచ్చింది. ఇక ఫలితాల రోజు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇంత ధీమాగా ఉంది గనుకే ఎవరికి ఏం పదవులు కట్టబెట్టాలని లెక్కలేసుకునే పనిలో అధిష్ఠానం ఉంది. ముఖ్యంగా రోజాకు ఈసారి కీలక పదవే దక్కుతుందని వైసీపీ నుంచి వస్తున్న సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రోజాకు శాసన సభ స్పీకర్ పదవి ఇస్తారని సమాచారం. ఈసారి మంత్రి వర్గంలో రోజాకు చోటు ఉండదని.. అందుకే అందుకు తగ్గట్టుగానే మంచి పదవి ఇదేనని వైఎస్ జగన్ సైతం భావిస్తున్నారని తెలియవచ్చింది.
చరిత్రలో రోజాకు చోటు..!
ఒకవేళ శాసన సభాపతిగా రోజాను నియమిస్తే మాత్రం అదో చరిత్రే అవుతుంది. ఎలాగంటే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కోడెల శివప్రసాద్, రెండోసారి తమ్మినేని సీతారాం.. ఇప్పుడు రోజా అవుతారన్న మాట. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మహిళ సభాపతి రోజానే అవుతారు. అంటే ఇది నిజంగా రికార్డు బ్రేక్ అని చెప్పుకోవచ్చు. రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రోజాకు కూడా చోటు దక్కుతుంది అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇందులో నిజానిజాలు ఎంత..? అసలు ఈసారి రోజా గెలిచే అవకాశాలు ఏ మాత్రం ఉన్నాయ్..? జూన్ నాలుగో తేదీన ఉదయమే తెలిపోనుంది. ఎందుకంటే తొలి ఫలితం నగరి నియోజకవర్గం నుంచే వెలువడనుంది. సో.. రోజా పరిస్థితి ఏంటనేది మరో వారంలో తేలిపోనుందన్నమాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.