పవన్‌కు కంగ్రాట్స్ చెప్పిన వైఎస్ షర్మిల!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు, అభినందలు తెలిపారు. అవునా.. ఎందుకు ఈ శుభాకాంక్షలు అనే సందేహం వచ్చింది కదూ..? మీరు వింటున్నది నిజమే. గురువారం రోజున హైదరాబాద్ నగరంలోని పవన్ నివాసం వేదికగా జరిగిన సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు. ఐతే ఈ భేటీపై చిత్ర విచిత్రాలు వార్తలు పుట్టుకొస్తున్నాయి. జనసేన అనుకూల మీడియాలో ఒక రకంగా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మరో రకంగా.. ఇక సోషల్ మీడియాలో ఐతే బాబోయ్ చూడలేం.. చెప్పలేం..!
ఏం జరిగింది..?
హైదరాబాద్ లోని పవన్ నివాసంలో జరిగిన భేటీలో ముందుగా పిఠాపురం నుంచి గెలవబోతున్న సేనానికి అభినందనలు తెలిపారు షర్మిల. ఈ మాటకు నవ్వుకున్న పవన్.. తిరిగి షర్మిలకు కూడా కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తోంది. సుమారు 20 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలు, కూటమి అధికారంలోకి వస్తే పవన్ హోదా, పదవిపై కూడా చర్చ జరిగిందని టాక్ నడుస్తోంది. పైగా.. అమరావతి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ కాబోతున్నారు. ఈ క్రమంలో ఒక్కరోజు ముందు షర్మిల.. పవన్ ఇంటికి వెళ్లి మరీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే ఈ భేటీ మూడో కంటికి తెలియకుండా జరిగిందని తెలుస్తోంది. ఎక్కడా పెద్దగా మీడియాలో కూడా ఇదంతా కనిపించలేదు.
ఒక్కటే విమర్శలు..!
ఇక ఈ భేటీపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షర్మిలను, ఆమె చేస్తున్న రాజకీయాలు చూసి జనాలు అసహ్యించుకుంటున్నారని కన్నెర్ర చేస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడని వెళ్ళావా..? లేకుంటే మనకంతా బాస్ చంద్రబాబు ఒక్కడేనని.. మనమంతా ఒక్కటేని వెళ్ళావా..? అని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఐతే.. తమరు ఇండియా కూటమిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలివి.. ఆయనేమో ఎన్డీఏలో తోక పార్టీ జనసేన అధ్యక్షుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి NDA కూటమికి INDIA కూటమికి అస్సలు సరిపోదు. మరి మీరు ఎలా కలిశారు..? మీకంతా కామన్ శత్రువు జగన్ కాబట్టి ఇందుకే
కలిశారా..? ఓడిపోతున్నామని ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారా..? అని మరికొందరు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. చూశారుగా.. అటు భేటీ.. ఇటు. తిట్లు ఎలా ఉన్నాయో కదా!!