పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్ర ప్రమోషన్స్ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ వేదికగా కల్కి బుజ్జి vs భైరవ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేసిన నాగ్ అశ్విన్ అండ్ టీం ఇప్పుడు బుజ్జిని చెన్నైకి పంపించారు. అక్కడ కూడా ఇదే మాదిరి మరో గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోపక్క కల్కి యానిమేటెడ్ ద్వారా చిన్నారులని ఆకర్షించే ప్రయత్నాలు మొదలైపోయాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి 2898 AD గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. కల్కి విడుదలకు సమయం దగ్గర పడుతుంది. సరిగ్గా నెల టైం ఉండడంరో మేకర్స్ కల్కి ప్రమోషన్స్ ని ఓ రేంజ్ చుట్టేస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా ప్రముఖ నగరాల్లో భారీ ఈవెంట్స్ ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.
ప్రమోషన్స్ లో భాగంగానే కల్కి 2898 AD ట్రైలర్ ని జూన్ 7 న పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. కల్కి ట్రైలర్ వస్తే.. ఇప్పుడు ఉన్న అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయనడంలో సందేహం లేదు, ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా బుజ్జి మ్యానియాతో కొట్టుకుంటున్నారు. మరి జూన్ 27 న కల్కి వచ్చే వరకు అభిమానులు ఆత్రుత నడుస్తూనే ఉంటుంది.