ఏపీ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ప్రతి నియోజక వర్గంలో మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని అందరూ ధీమాతో కనబడుతున్నారు. కేంద్రంలో మోడీ గెలుస్తారని పలు సర్వేలు ప్రకటించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అందులోను ఏపీలో గెలవబోయేది ఎవరు అనే విషయంలో బెట్టింగ్ మాత్రమే కాదు తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది.
దేశం మొత్తంలో తోలి ఫలితం వెలువడబోయే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏపీలో బోణి కొట్టబోయేవారిపై అందరిలో విపరీతమైన ఆసక్తి నడుస్తుంది. ఫైనల్ గా ఎన్నికల కౌంటింగ్ ని ఈసీ మొదలు పెట్టింది. ఏపీలో అల్లర్లు జరక్కుండా కేంద్ర బలగాలను మోహరించారు. పోలింగ్ రోజున జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఇక ఆంధ్రలో చంద్రబాబు vs జగన్ అన్నట్టుగా ఫైట్ నడుస్తుంది. చంద్రబాబు ఇప్పటికే గెలుస్తారనే సంకేతాలతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ఫలితాల కోసం వెయిట్ చేస్తుంటే.. మొదటి నుంచి మేమె గెలుస్తామనే ధీమాతో ఉన్న జగన్ అండ్ కో ఎగ్జిట్ పోల్స్ తర్వాత నరాలు తెగే టెన్షన్ తో ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. మరి ఈ రోజు మద్యాన్నం 12 నుంచి 1 గంటకల్లా ఎవరు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే విషయంలో స్పష్టత వచ్చే అవకాసం ఉంది. ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి.. సినీజోష్ !