పవన్ కళ్యాణ్ ఎమ్యెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలెట్ అవుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా మారకముందు నుంచి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ వచ్చారు. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు, నాలుగో పెళ్లి అంటూ నీచమైన కామెంట్స్ చేసారు.
ఇక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాని కూడా వదిలేసాడు, అందుకే పిఠాపురం గృహప్రవేశానికి తీసుకురాలేదు అంటూ మాట్లాడారు. జనసేన నుంచి బయటికి వచ్చి వైసీపీ లో చేరిన పోతిన మహేష్ అయితే పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా పై చాలా చెండాలమైన కామెంట్స్ చేసాడు. కానీ పవన్ కళ్యాణ్ అందరి నోరుపడిపోయే ట్విస్ట్ ఇస్తూ ఎన్నికల పోలింగ్ రోజు భార్య తో సహా ఓటు వెయ్యడానికి మంగళగిరి వచ్చారు.
ఆ తర్వాత భార్యని వెంట తీసుకుని వారణాసి వెళ్లారు. ఇక ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచి పవన్ భార్య అన్నా లెజినోవా ఆయనతోనే కనబడుతుంది. చంద్రబాబు ని ఆహ్వానించడం దగ్గర నుంచి నిన్న మోడీని కలిసి శుభాకాంక్షలు తెలుపడం అంతా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తోనే కలిసి చేసారు.
ఇక మెగాస్టార్ ఇంటికి ఆశీస్సుల కోసం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సమయంలో పవన్ చెప్పులు పట్టుకుని అన్నా లెజినోవా కనిపించడంతో పవన్ అభిమానులు పొంగిపోతున్నారు. అన్న నీకు తగిన భార్య దొరికింది. ఆమె విదేశీయురాలు అయినా నీ చెప్పులు చేతబట్టుకుంది. అన్న మీ భార్య పై గౌరవం, అభిమానం పెరిగిపోయింది. వదినమ్మ నువ్ సూపర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు సాధారణ పౌరులు కూడా మాట్లాడుతున్నారు.