Advertisementt

అంగరంగ వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం

Tue 11th Jun 2024 03:33 PM
aishwarya arjun  అంగరంగ వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
Aishwarya Arjun marries Umapathy Ramaia అంగరంగ వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
Advertisement
Ads by CJ

సీనియర్ హీరో అర్జున్ కుమర్తె హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ వివాహం గత రాత్రి చెన్నై లో ఉమాపతితో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. గత మూడు రోజులుగా అర్జున్ ఇంట్లోనే ఐశ్వర్య అర్జున్ పెళ్లి వేడుకలు అంటే ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని కూడా ఓ రేంజ్ లో నిర్వహించారు. హల్దీ సెర్మోనీ దగ్గర నుంచి పెళ్ళి కూతురు ఫంక్షన్ వరకు అన్నిటిని సాంప్రదాయ బద్దంగా నిర్వహించింది అర్జున్ ఫ్యామిలీ. 

అర్జున్ చెన్నై లో స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో చాలా అంటే చాలా గ్రాండ్ గా ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల మద్యన ఐశ్వర్య మెడలో ఉమాపతి మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు. నిన్న రాత్రి జరిగిన పెళ్లి ఫొటోస్ ని ఐశ్వర్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి షేర్ చేసింది. 

ఐశ్వర్య-ఉమాపతి పెళ్ళికి కోలీవుడ్ హీరోలైన కార్తీ, విశాల్ తో పాటుగా సీనియర్ నటులు హాజరయ్యారు. రెడ్ కలర్ పెళ్లి చీరలో ఐశ్వర్య మెరిసిపోయింది. ప్రస్తుతం ఐశ్వర్య-ఉమాపతిల వెడ్డింగ్ ఫొటోస్ వైరల్ గా మారాయి.  

Aishwarya Arjun marries Umapathy Ramaia:

Aishwarya Arjun marries Umapathy Ramaiah

Tags:   AISHWARYA ARJUN