Advertisementt

ఒకేసారి 6 ప్లాట్స్ కొన్న హీరో

Thu 20th Jun 2024 03:41 PM
abhishek bachchan  ఒకేసారి 6 ప్లాట్స్ కొన్న హీరో
Abhishek Is Making Smart Investment ఒకేసారి 6 ప్లాట్స్ కొన్న హీరో
Advertisement
Ads by CJ

బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా.. హీరోలు ఓ ప్రాపర్టినో, లేదంటే ఇళ్లు కొనుగోలు చేసారంటే.. దాని ధర ఎంత. అది ఏ ప్లేస్ లో ఉంది, ఎంత కాస్ట్లీ ఏరియా లో ఉంది, ఎందుకు సడన్ గా ఆ హీరోగారు ఇంటి మీద పెట్టుబడి పెట్టారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ హీరో అది కూడా ట్రేండింగ్ లో లేని ఓ హీరో ఇళ్ళు కొన్నారంటే అది సెన్సేషనల్ అవుతుంది కదా. 

బాలీవుడ్ లో కెరీర్ స్టార్టింగ్ లో విజయాలు అందుకుని.. ప్రస్తుతం ఓటీటీ లకి పరిమితమైన అభిషేక్ బచ్చన్.. కొద్దిరోజులుగా నటన కన్నా ఎక్కువగా బిజినెస్ వ్యవహారంలో తలమునకలై ఉన్నాడు. కెరీర్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేయలేకపోయిన అభిషేక్ బచ్చన్ ప్రపంచ మాజీ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

అయితే ఈమధ్యన ఎక్కువగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అభిషేక్ బచ్చన్ తాజాగా ముంబై లో ఆరు ప్లాట్స్ కొనుగోలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బోరివాలి సంబరన్ ప్రాంతంలో అభిషేక్ బచ్చన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ కి సంబందించిన ఓ అపార్ట్మెంట్ లో ఆరు ప్లాట్ లు కొనుగులు చేసాడు. ఈ ఆరు ప్లాట్ల ధర 15 కోట్లు అని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్టేషన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యని తెలుస్తోంది, ఈ ప్లాట్స్ మొత్తం 57 వ అంతస్తులో ఉన్నట్లుగా సమాచారం. 

Abhishek Is Making Smart Investment:

Abhishek Bachchan Buys Six Apartments For 15 Crores

Tags:   ABHISHEK BACHCHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ