గత ప్రభుత్వంలో బూతు మంత్రిగా, గుట్కా మంత్రిగా పిలిపించుకున్న కొడాలి నాని ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మాత్రమే కాదు అధికార మదం ఎక్కి కొట్టుకున్న ప్రతి నాయకుడు ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అక్కడ ప్రజలు టీడీపీ కూటమిపై ప్రేమతో ఓట్లేసారో.. లేదంటే ఇలాంటి చెత్త నాయకులతో మనకు అవసరం లేదు అనుకున్నారో కానీ కొడాలి నాని లాంటి వాళ్ళని అసంబ్లీ లోకి పంపించేందుకు నిరాకరించారు.
ఓడిపోయాక కొడాలి నాని పై టీడీపీ నేతలు తిరగబడేందుకు సిద్దమైనప్పటికి.. వారు చంద్రబాబు, లోకేష్ కను సైగ కోసం వెయిట్ చేస్తున్నారు. ఘోరమైన ఓటమి తర్వాత కామ్ గా మా మీద దాడులు జరుగుతున్నాయంటూ సుద్దపూసలా మాట్లాడిన నాని ఇప్పుడు మళ్లీ నోరు పారేసుకుంటున్నాడు. మమ్మల్ని ఏమి పీకలేరు, జగన్ ని అస్సలేం పీకలేరు, చంద్రబాబు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమను, మా సంగతి తర్వాత అంటూ నోరు విప్పుతున్నారు.
ఇక టీడీపీ అధికారంలోకి రాగానే బుద్ధా వెంకన్న కొడాలి నాని, వల్లభనేని వంశి లకి తన స్టయిల్లో వార్నింగ్ ఇచ్చాడు. మీ పనైపోయింది.. మీ సంగతి తేలుస్తాం, మీరు ఇచ్చిదనదంతా తిరిగిచేస్తాం అంటూ మాట్లాడారు. తాజాగా బుద్ధా వెంకన్న మరోసారి కొడాలి నాని కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నానికి ఇచ్చిన టైమ్ అయ్యిపోయింది.
పెళ్ళాం పిల్లలతో పారిపో వదిలేస్తాం, పిచ్చి వాగుడు వాగితే నడి రోడ్డు మీదకి లాక్కొని వచ్చి కొడతా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్లు దాడి చేయొద్దు అన్నారు కాబట్టి ఆగుతున్నాను అంటూ కొడాలికి బుద్ధా మాస్ వార్నింగ్ ఇచ్చారు.