మెగా వారసురాలు క్లింకార పుట్టి అప్పుడే ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 20 న మెగా ఫ్యామిలోకి క్లింకార జననం ఆ ఫ్యామిలీకి ఆనందాన్నిచ్చింది మెగాస్టార్ కి వారసురాలు పుట్టింది అంటూ మెగా అభిమానులు పూల వర్షం కురిపించారు. రామ్ చరణ్ - ఉపాసనల పదకొండేళ్ల ప్రేమ బంధానికి గుర్తుగా క్లింకార జననం పట్ల తల్లితండ్రులుగా రామ్ చరణ్-ఉపాసనలు చాలా ఎగ్జైట్ అయ్యారు.
ఇక పాప పుట్టాక మెగా ఫ్యామిలిలో అంతా మంచి జరిగింది అంటూ వాళ్ళు సంబరపడని రోజు లేదు. అయితే పాప తో ఫెస్టివల్స్ చేసుకున్నా, వెకేషన్స్ కే వెళ్లినా క్లింకార ని ఇప్పటివరకు చూపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్, ఉపాసనలు క్లింకార ని తీసుకుని ఎక్కడికెళ్లినా పాప మొహం మీడియాకి కనిపించకుండా దాచేస్తున్నారు.
సరే జూన్ 20 కి క్లింకార జన్మించి ఏడాది పూర్తయ్యింది. ఇకనైనా పాపం మొహాన్ని రివీల్ చేస్తారని అందరూ ముఖ్యంగా మెగా అభిమానులు ఎక్స్పెక్ట్ చేసారు. క్లింకార పుట్టిన రోజున అయినా బర్త్ డే సెలెబ్రేషన్స్ తో పాటుగా క్లింకార ని అందరికి చూపిస్తారనుకుంటే అదేమీ జరగలేదు. ఎప్పటిలాగే క్లింకార ని హైడ్ చేస్తూ సెలెబ్రేషన్స్ జరిగిపోయాయి. మరి క్లింకార దర్శనం ఎప్పుడు అనేది మెగా ఫ్యామిలీ ఎప్పుడు డిసైడ్ చేస్తుందో కాస్త వేచి చూడాల్సిందే.!