హైదరాబాద్ బ్యూటీ అదితి రావు హైదరి ఎప్పడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. హీరో సిద్దార్థ్‌తో పెళ్ళికి సిద్దమైన అదితి రావు ఆ మధ్యన సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. సీక్రెట్ కాదు ప్రవేట్ ఫంక్షన్ అంటూ సిద్దు-అదితి లు వాదించినా దానిని అందరూ సీక్రెట్ నిశ్చితార్థంగానే పరిగణించారు.
ఇక డేటింగ్‌లో ఉన్న విషయాన్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన ఈ జంట పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందా.. ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులైంది అని ఇరువురి అభిమానులు వెయిట్ చెయ్యని రోజులేదు. అయితే సిద్దార్థ్-అదితి రావు ఇద్దరూ కెరీర్‌లో బిజీగా వున్నారు. సిద్దు ప్రస్తుతం ఇండియన్ 2 ప్రమోషన్స్ కోసం కమల్‌తో కలిసి దేశ విదేశాలు తిరుగుతున్నాడు.
మరోపక్క అదితి రావు కూడా హీరామండి వెబ్ సీరీస్ తర్వాత సోషల్ మీడియాలో బిజీగా వుంది. సోషల్ మీడియాలో అటెన్షన్ పొందేలా గ్లామర్ ఫొటోస్‌ని షేర్ చేస్తుంది. తాజాగా స్కై కలర్ మోడ్రెన్ వేర్‌లో అదితి రావు అదరగొట్టేసింది. లూజ్ హెయిర్ తో ఫ్యాషనబుల్‌గా రెడీ అయిన అదితి లుక్ చూసి వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.