నందమూరి వారసుడు ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ అప్పుడే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. మోక్షజ్ఞ అప్పుడప్పుడు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు ఆ పిక్ ని నందమూరి అభిమానులు స్ప్రెడ్ చేస్తూ వైరల్ చేస్తారు. ఇప్పడు పూటకో ఫోటో బయటికి వస్తుంది. దానితో నందమూరి అభిమానులు చెలరేగిపోయి మరీ దానిని వైరల్ చేసేస్తున్నారు.
నిన్న మోక్షజ్ఞ న్యూ ఫోటో షూట్ పిక్ తో పాటుగా వస్తున్నా.. అనే కామెంట్ సోషల్ మీడియాలో కనిపించగానే నందమూరి అభిమానులకి పూనకలొచ్చేశాయి. దానితో మోక్షజ్ఞ హాట్ టాపిక్ గా మారిపోయాడు. అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ, ఇదిగో ఈ దర్శకుడు తోనే మోక్షజ్ఞని సినిమా తెరకి బాలయ్య పరిచయం చెయ్యబోతున్నారు, ఆగష్టు లో శ్రావణమాసం వస్తుంది.. ఆ నెలలోనే మంచి రోజు చూసుకుని మోక్షు ఎంట్రీపై బాలయ్య అధికారిక ప్రకటన ఇస్తారంటూ న్యూస్ లు మొదలైపోయాయి.
నిన్నటి పిక్ ఇంకా ట్రెండింగ్ లో ఉండగానే ఈరోజు మోక్షజ్ఞ మరో స్టైలిష్ పిక్ బయటికి వచ్చింది. అచ్చం హీరోలా ఉండడమేమిటి.. హీరోనే అనేలాంటి ఫేస్ కట్స్, సూపర్ స్టైలిష్ హ్యాండ్ సమ్ లుక్స్, పర్ఫెక్ట్ ఫిజిక్ తో మోక్షజ్ఞ అదరగొట్టేసాడు. నిన్నటి పిక్ ని చూసే ఉబ్బి తబ్బిబ్బవుతున్న నందమూరి అభిమానులు.. ఈరోజు మోక్షజ్ఞ లుక్ చూసాక దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
అసలు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అంతగా.. వార్తల్లో ఉండని సినీ వారసుల్లో మోక్షజ్ఞ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. హీరో అవ్వకముందే ఇలా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడంటూ నందమూరి అభిమానులు సంబరాలకు రెడీ అవుతున్నారు.