వైసీపీ ఓడిపోయింది వాలంటీర్ వ్యవస్థ వల్లే అని పలువురు వైసీపీ ప్రముఖ నేతలే వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి ముఖ్యంగా వాలంటీర్ల వల్లే వైసీపీ ప్రజలకి దూరమైంది.. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి మంచి జరిగింది కానీ.. వైసీపీ పార్టీకి మాత్రం కావాల్సినంత చేడు జరిగింది అంటూ వైసీపీ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు.
ఇప్పుడా లిస్ట్ లో గుడివాడ అమర్నాధ్ కూడా జాయిన్ అయ్యాడు. గుడ్డు అమర్నాధ్ గా టీడీపీ వాళ్లకు పిలుచుకునే అమర్నాధ్ టీడీపీ నేతలు, జనసేన నేతలపై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్ చేసేవాడు. ఇప్పుడు వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థే అసలు కారణమని చెప్పడం గమనార్హం. వాలంటీర్ల వల్ల ప్రజలకి మంచి జరిగిన పార్టీ ఓడిపోవడానికి వారే కారణం.. వాళ్ళ వల్లే ప్రజలకి పార్టీకి మధ్య అగాధం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు.
మరి అమర్నాధ్ కూడా అసలు విషయం అవగతమైనట్లుంది. ఇక కూటమి ప్రభుత్వం ప్రస్తుతం హనీమూన్ లో ఉంది. అది పూర్తవగానే తాము వారిపై యుద్ధం చేస్తామంటూ అమర్నాధ్ చెప్పుకొచ్చాడు. మరోపక్క జగన్ కూడా వైపు పార్టీకి ప్రజల్లో అసలు వ్యతిరేఖత లేదు, ప్రజలకి మంచి చేసి వైసీపీ ఓడిపోయింది మన పార్టీ ని మళ్ళీ ప్రజలే గెలిపిస్తారంటూ ఇంకా భ్రమలోనే మాట్లాడుతున్నాడు.