Advertisementt

అఖండ 2 మొదలయ్యేది అప్పుడే !!

Thu 04th Jul 2024 08:29 PM
akhanda 2  అఖండ 2 మొదలయ్యేది అప్పుడే !!
Akhanda 2 is about to start!! అఖండ 2 మొదలయ్యేది అప్పుడే !!
Advertisement
Ads by CJ

బోయపాటి-బాలయ్య కలిసి సినిమా అనగానే నందమూరి అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ మొత్తం అలెర్ట్ అవుతారు. హ్యాట్రిక్ విజయాలతో ఉన్న కాంబో కదా.. అందుకే మరో సినిమా అనగానే ట్రేడ్ కూడా ఈ చిత్రంపై అటెన్షన్ గానే కనిపిస్తుంది. అయితే బాలయ్య ఎమ్యెల్యేగా హ్యటిక్ కొట్టి ప్రస్తుతం NBK109 షూటింగ్ చేస్తున్నారు. అది పూర్తి కాగానే బాలయ్య బోయపాటి తో మూవీ స్టార్ట్ చేస్తారు. 

అది అఖండ కి సీక్వెల్ గా అఖండ 2 మొదలు పెట్టేందుకు బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో కూటమి గెలుపు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో హుషారుమీదున్న బాలయ్య-బోయపాటి ఇద్దరూ అమరావతి సాక్షిగా అఖండ 2 ని మొదలు పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. అమరావతిలో అఖండ 2 ని గ్రాండ్ గా మొదలు పెడతారని అన్నారు. 

అయితే తాజాగా అఖండ 2 ని మరో రెండు నెలలు వరకు మొదలు పెట్టరు. రెండు నెలలు తర్వాత అఖండ 2 ని మొదలు పెడతారు, ఇందులో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ కూడా కంటిన్యూ అవుతుంది.. ఇంకా మిగతా నటులు, టెక్నీకల్ టీం ఫైనల్ అవ్వలేదు, ప్రస్తుతం బోయపాటి స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారట. సో అఖండ 2 అమరావతిలోని మొదలైనా.. అది మరో రెండు నెలల తర్వాతే అన్నమాట. 

Akhanda 2 is about to start!!:

Akhanda 2 update 

Tags:   AKHANDA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ