కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ జులై 2 న ముంబై కి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ ని థాయిలాండ్ వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని.. చెన్నై లో ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చింది. వరలక్ష్మి తన తండ్రి శరత్ కుమార్, కాబోయే భర్త సచ్ దేవ్ తో కలిసి కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటుగా పీఎం మోడీని తన వివాహ మహోత్సవానికి ఆహ్వానించింది.
అయితే థాయిలాండ్ లో చేసిన పెళ్లికి, చెన్నై లో గ్రాండ్ గా నిర్వహించిన రిసెప్షన్ కి వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కోట్లలో డబ్బు ఖర్చు పెట్టారు, వరలక్ష్మి చేసుకున్న నికోలాయ్ సచ్ దేవ్ ముంబైలో ధనవంతుడు. అతను తన భార్య కోసం బంగారు చెప్పులు, డైమండ్స్ పొదిగిన చీరని బహుమతిగా ఇచ్చారు. ఈ పెళ్లి కోసం శరత్ కుమార్ దాదాపుగా 200 కోట్లు ఖర్చు పెట్టారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
తన కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ కి తాను కోట్లలో ఖర్చు పెట్టిన వార్తలపై శరత్ కుమార్ స్పందించారు. నేను నా కుమార్తె పెళ్లి కోసం 200 కోట్లు ఖర్చు పెట్టాను అంటున్నారు. అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, నిజాలు తెలియకుండా ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చెయ్యొద్దు. పెళ్లి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు.
అయినా అంత డబ్బు నాకెక్కడిది. నేను చాలా సాధారణంగానే నా కుమార్తె వివాహాన్ని జరిపించారు. పూర్తిగా తెలియకుండా ఇలాంటి వార్తలు రాయకండి, నమ్మకండి అంటూ వరలక్ష్మి పెళ్లి ఆమె తండ్రి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.