గుంటూరు కారం తర్వాత వినిపించదు అనుకున్న పేరు ఇప్పుడు సౌత్ లో మోగిపోతుంది. తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా వున్న తార మీనాక్షి చౌదరి. ఆమె స్టార్ హీరో విజయ్ తో నటించిన కోలీవుడ్ మూవీ GOAT సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది. అదే వారంలో ఆమె దుల్కర్ తో కలిసి నటించిన లక్కీ భాస్కర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అంతేకాదు.. ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ తో పాటుగా.. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం వరస షూటింగ్స్ తో బిజీగా ఉంటేనేమి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫొటోస్ తో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా మీనాక్షి వదిలిన పిక్స్ చూస్తే కిక్ రావాల్సిందే. ఆ ఫొటోస్ లో గ్లామర్ షో కనిపించకపోయినా.. మీనాక్షి లుక్స్ మాత్రం కిల్ చేసేస్తున్నాయి. లూజ్ హెయిర్ తో మీనాక్షి చౌదరి ఇచ్చిన కిల్లింగ్ ఫోజులకి యూత్ మొత్తం ఆమె చుట్టూ తిరగడం ఖాయం. మీరు ఓసారి మీనాక్షి ఫ్రెష్ లుక్స్ ని ఓసారి చూసెయ్యండి.