టాలీవుడ్ లో హీరోయిన్ నేహా శెట్టి పేరు ఎక్కువగా టిల్లు గాడి గర్ల్ ఫ్రెండ్ రాధిక గానే పాపులర్ అయ్యింది. అక్క రాధికా అంటూ సిద్దు జొన్నలగడ్డ నేహా శెట్టిని డీజే టిల్లు లోనే కాదు.. టిల్లు స్క్వేర్ లోను ఆటపట్టించిన తీరు అందరిని కామెడీగా నవ్వించింది. ఇక నేహా శెట్టి అందాలు ఆరబోస్తున్న బ్రేకిచ్చే సినిమా మాత్రం ఆమెకి రావడం లేదు.
సోషల్ మీడియాలోనే కాదు.. సిల్వర్ స్క్రీన్ పై కూడా గ్లామర్ డాల్ లా అందాలు ఆరబోసే పాత్రలు చేస్తున్నా అమ్మడు ఒంక యంగ్ హీరోలు చూడడం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ అన్నప్పటికి.. నేహా శెట్టికి ఆ చిత్రం వల్ల ఒరిగిందేమిటి కనిపించడం లేదు..
తాజాగా నేహా శెట్టి అదిరిపోయే ఫొటోస్ వదిలింది. మతిపోయే భంగిమలో నేహా శెట్టి మెస్మరైజ్ చేసింది. అందాలు అరబోయడంతో ఆరితేరినట్టుగా నేహా శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్ కనిపించింది. వైట్ టాప్ లో బెడ్ పై నేహా శెట్టి ఇచ్చిన ఫోజులకు యూత్ కి మతి పోవడం మాత్రం ఖాయం.