Advertisementt

NBK 109 సెట్స్ లో హీరోయిన్ కి గాయాలు!!

Wed 10th Jul 2024 01:38 PM
urvashi rautela  NBK 109 సెట్స్ లో హీరోయిన్ కి గాయాలు!!
Heroine injured in NBK 109 sets!! NBK 109 సెట్స్ లో హీరోయిన్ కి గాయాలు!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల్ల ఇప్పుడు చాలా తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది. మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కాలు కదిపిన ఊర్వశి రౌతేల్ల నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK 109 లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, అలాగే మరో హీరోయిన్ కూడా ఉన్నారు. 

అయితే ఊర్వశి రౌతేల్ల కి NBK 109 సెట్స్ లో చిన్నపాటి ప్రమాదం జరిగి గాయాలైనట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊర్వశి కి అసలేమైంది, ఎలా గాయాలైనాయి అనే విషయంపై క్లారిటీ లేదు, అంతేకాకుండా ఈ విషయంపై NBK 109  యూనిట్ కూడా స్పందించలేదు. 

కానీ ఊర్వశి రౌతేల్ల కి NBK 109 లో గాయాలవడం వాస్తవం అని, ఆమెకి జరిగింది పెద్ద ప్రమాదం కాదని, ఆమెకి ప్రమాదం జరగగానే యూనిట్ సంభ్యులు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ఇక NBK 109 చిత్రాన్ని బాబీ డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. మహాశివరాత్రికి విడుదలైన NBK 109 గ్లిమ్ప్స్ మాస్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసింది, దానితో సినిమాపై భీబత్సమైన అంచనాలు మొదలైపోయాయి. 

Heroine injured in NBK 109 sets!!:

Urvashi Rautela injured on NBK 109 sets

Tags:   URVASHI RAUTELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ