Advertisementt

కల్కి సక్సెస్‌పై ప్రభాస్..

Mon 15th Jul 2024 07:29 PM
prabhas kalki 2898ad  కల్కి సక్సెస్‌పై ప్రభాస్..
Rebel Star Prabhas on Kalki 2898 AD Success కల్కి సక్సెస్‌పై ప్రభాస్..
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రభాస్‌కి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన రెండో చిత్రంగా ఈ సినిమా రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకు ముందు ‘బాహుబలి 2’ చిత్రం రూ. 1000 ప్లస్ కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని సైతం విడుదల చేశారు. తాజాగా ఈ సక్సెస్‌పై ప్రభాస్ కూడా ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..

అభిమానులను ఉద్దేశిస్తూ.. మీరు లేకపోతే నేను జీరో.. అందరికీ థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. ఈ సినిమా ఇంత గ్రాండియర్‌గా రావడానికి నాగ్ అశ్విన్, అలాగే నిర్మాతలు దత్తుగారు, ప్రియాంక, స్వప్ప ఎంతో కృషి చేశారు. ఖర్చు విషయంలో వెనకడుగు వేయలేదు. వారికి థ్యాంక్స్. అలాగే అమితాబచ్చన్ సార్, కమల్ సార్ నుంచి ఎంతో నేర్చుకున్నా. గాడ్జెస్ దీపకకు ధన్యవాదాలు. కల్కి రెండో భాగం మరింత భారీగా ఉండబోతోంది. మరోసారి నా అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాను. లవ్ యు సో మచ్.. అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

‘కల్కి 2898 AD’లో ప్రభాస్ భైరవగా, కర్ణగా కనిపించగా.. రెండో పార్ట్‌పై ఆసక్తిని పెంచేలా, ఇంకా చెప్పాలంటే ఈగర్‌గా వెయిట్ చేసేలా మొదటి పార్ట్‌ని ముగించారు. ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా అని ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం పార్ట్ 2 ఇంకా 60 శాతం వరకు షూటింగ్ జరగాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ డైరీ మాత్రం ప్రస్తుతం ఫుల్ అయిపోయింది. ఆయన ఏ సినిమాకు నెక్ట్స్ పనిచేయబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. రాజా సాబ్ దాదాపు చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఎటువైపు అనేది తెలియాల్సి ఉంది.

Rebel Star Prabhas on Kalki 2898 AD Success:

Prabhas Happy with Kalki 2898 AD Success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ