కొద్ది రోజులుగా అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు ప్రణీత్ హనుమంతు. పేరు ఎంత చక్కగా ఉంది.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా అంతకుమించి ఉంది. కానీ.. వీడి బుర్రంతా బూతే..! పేరుకే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అయినప్పటికీ చేసేవన్నీ చెత్త పనులే..! ఎంతలా అంటే.. తండ్రీకూతుళ్ల బంధాన్ని నీచాతి నీచంగా చూపిస్తూ, నోటికొచ్చిన కారు కూతలు కూసేంత..! పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినా.. తండ్రి గొప్పోడైనా వీడు మాత్రం పండిత పుత్ర..... అన్నట్లు లెక్క! తండ్రీకూతుళ్ల బంధాన్ని డార్క్ కామెడీ పేరుతో విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారి.. నోటి దూలతో బెంగళూరులో అరెస్టయ్యి నాంపల్లి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌లో ఉన్నాడు. ఇక అసలు విషయానికొస్తే.. సరిగ్గా ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పేరు నెట్టింట్లో తెగ మార్మోగిపోతోంది.
నెక్స్ట్ వికెట్ ఇతనే..!
ప్రణీత్ తర్వాత హైపర్ ఆది వ్యవహారం తెరపైకి వచ్చింది!. హనుమంతు దొరికిన దొంగ అయితే.. ఆది దొరకని దొంగ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీవీ షోలలో అడల్ట్ కంటెంట్ గురించే చర్చ నడుస్తున్న ఈ సమయంలో ఆదీ గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇతను కామెడీ పేరుతో జుగుప్సాకర, దౌర్భాగ్యకరమైన డబుల్ మీనింగులతో నవ్వును కాస్త బూతు చేశాడనే తిట్టి పోస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ.. ఢీ షోలో వచ్చే వల్గారిటీతో కుటుంబం కలిసి షోలు చూడలేని పరిస్థితి నెలకొందని సభ్య సమాజం దుమ్మెత్తిపోస్తోంది. ముఖ్యంగా.. సెక్సువల్, డబుల్ మీనింగ్ కంటెంట్ రోజు రోజుకీ ఎక్కువ అవుతోందని జనాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి కర్త, కర్మ.. క్రియ ఆదీయేనని చెప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
ఆ పరిస్థితే లేదే..!
జబర్దస్త్ అంటే ఎంతో కామెడీగా అంతకుమించి హెల్తీగా ఉండేది.. మహిళలు, పిల్లలతో కలిసి కుటుంబమంతా చూసేది..! ఎప్పుడైతే ఆది వచ్చాడో నాటి నుంచే సర్వనాశనమైందన్న ఆరోపణ ఇప్పటిదేం కాదు. ఆ వికృత చేష్టలు, జుగుప్సాకరమైన మాటలు విపరీతంగా పెరిగిపోయి ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నామని చెబుతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా వల్గర్ వ్యాఖ్యలు, అమ్మాయిలను చులకనగా చూపించడం.. వారిపై డబుల్ మీనింగ్స్, బాడీ షేమింగ్ ఇలాంటి నిత్యకృత్యం అయ్యాయని విమర్శకులు తిట్టేస్తున్నారు. అయితే ఈ బూతులనే సదరు చానెల్స్ యాజమాన్యాలు సక్సెస్ ఫార్ములాగా భావిస్తుండటం గమనార్హం అని మేథావులు మండిపడుతున్నారు.
సెన్సార్ లేకుంటే ఎలా..?
ఈ కామెడీ స్కిట్లకు సెన్సార్ అంత సీన్ అవసరం లేదు కానీ.. కనీసం షో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గర బూతులు కట్ చేసే కార్యక్రమం జరగాలి.. జరిగి తీరాల్సిందే..! చానెల్స్ పేరు మాత్రం గొప్ప.. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో దిబ్బ అవుతోందని ప్రేక్షకులు వాపోతున్నారు. ఇకపై కూడా ఫ్యామిలీతో చూసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నట్లు కామెంట్స్ రూపంలో వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆదిలో కూడా మార్పు రావాలని లేకుంటే ప్రణీత్ పరిస్థితి రావొచ్చన్నది ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కామెడీని.. కామెడీగా చేయాలే తప్ప.. కామం, బూతుమయం చేస్తే మంచిదని ఆదికి సభ్య సమాజం సూచిస్తోంది. అంతేకాదు.. ప్రణీత్ విషయంలో స్పందించినట్లే ఈ బూతులపై కూడా హీరోలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ కన్నేసి ఉంచితే మంచిది సుమీ.