అల్లు ఆర్మీ అంటూ అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ కి అండగా నిలుస్తూ అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్-అల్లు ఫ్యాన్స్ అంటూ మెగా ఫ్యామిలిలో అభిమానులు విడిపోయారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కి అనూహ్యంగా పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ పెరగడమే కాదు నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నాడు.
అయితే కొద్దిరోజులుగా అల్లు అర్జున్ కాంట్రవర్సీలకు నెలవుగా మారుతున్నాడు. ఈ ఏడాది ఏపీ ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ కి ఆన్ లైన్ సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ తన భార్య ఫ్రెండ్ భర్తకు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం పట్ల పవన్ ఫ్యాన్స్ నుంచి, మెగా ఫ్యాన్స్ నుంచి చాలా వ్యతిరేఖత ఎదుర్కున్నాడు. అయినప్పటికీ అల్లు ఫ్యాన్స్ తమ హీరోను డిఫెండ్ చేసుకున్నారు.
అదే క్రమంలో కిర్రాక్ ఆర్పీ అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. అల్లు ఆర్మీ, ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి చేశారనే న్యూస్ వినిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ కి - సుకుమార్ కి మద్యన విభేదాలు, పుష్ప 2 వాయిదా అంటూ వార్తలు ప్రచురిస్తున్నారనే కోపంతో ఓ సోషల్ మీడియా హ్యాండిల్ సంస్థ ఆఫీస్ పై అల్లు ఆర్మీ దాడులు చెయ్యడానికి ప్లాన్ చేసారని చెబుతున్నారు.
ఆ దాడులు చేసే వారిని పట్టుకునే క్రమంలో కొందరు పారిపోగా ఒకరు చిక్కారని వారు వీడియో కొన్ని ఫోటోలు పెట్టి రివీల్ చేశారు. వారు ఆ ఆఫీస్ పై దాడి చెయ్యడానికి వచ్చినట్టుగా సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఉందని చెప్పడమే కాదు.. దయచేసి మా ఆఫీస్ పై ఎలాంటి దాడులు చెయ్యొద్దని అల్లు అర్జున్ గారు తన అభిమానులని కంట్రోల్ చేస్తూ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని ఆ సంస్థ కోరుతుంది.
మరి అల్లు అభిమానులు ఇలాంటివి చేసి అల్లు అర్జున్ కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.