Advertisementt

పవన్ ఫ్యాన్స్ పగ బట్టేసారా?

Sun 21st Jul 2024 12:01 PM
sai baba  పవన్ ఫ్యాన్స్ పగ బట్టేసారా?
Are Pawan fans angry? పవన్ ఫ్యాన్స్ పగ బట్టేసారా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు. సొంత మనిషి, ఇంట్లో మనిషి పవన్ కళ్యాణ్ ని పిఠాపురం వచ్చి సపోర్ట్ చెయ్యకుండా ఎవడో స్నేహితుడు కోసం నంద్యాల వెళ్లి అక్కడ వైసీపీ నేత కోసం ప్రచారం చేరినప్పటి నుంచి మెగా ఫ్యామిలిలో ఎలా ఉందొ తెలియదు కానీ.. అల్లు అర్జున్ పేరు చెబితేనే పవన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై బాగా పగబట్టేసినట్లుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో రౌడీగా నటించిన సాయి బాబా అనే నటుడు అల్లు అర్జున్ తో సినిమాలో అవకాశం వచ్చినా చెయ్యను అంటూ చేసిన కామెంట్స్ ఇప్పడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి.

నటుడు సాయి బాబా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశం వచ్చినా నేను అతని సినిమాలో నటించను. అల్లు అర్జున్ బిహేవియర్ నాకు నచ్చదు. అతను అభిమానులను తన్నడం నేను చూసాను, అలా ఏ హీరో చేసినా నచ్చదు, హిట్లు, ప్లాప్ లు ఎన్నో వస్తాయి.

కానీ మనం ఎక్కడ నుంచి వచ్చామో అనేది మర్చిపోకూడదు అంటూ నటుడు సాయి బాబా, అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి పవన్ రాజకీయాల విషయంలో అల్లు అర్జున్ చేసిన పని వలనే అతను అలా మాట్లాడాడు అని అందరూ అనుకుంటున్నారు. 

Are Pawan fans angry?:

Gabbar Singh fame Sai Baba sensational comments on Allu Arjun behaviour

Tags:   SAI BABA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ