బిగ్ బాస్ ని ఫాలో అయ్యేవాళ్ళ కన్నా యూట్యూబ్ ని చూసే వాళ్ళకి దీప్తి సునయన అంటే తెలియని వారుండరు. అందులోను షణ్ముఖ్ జస్వంత్ మాజీ లవర్ అనగానే దీప్తి సునయన గుర్తుకు రావాల్సిందే. బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ ఫేమస్ అయ్యి సినిమా ఆఫర్స్ పట్టేద్దామనుకున్న దీప్తి సునయనకు, అటు షణ్ముఖ్ కి బిగ్ బాస్ వలన ప్రయోజనం కలగకపోగా.. వారిద్దరి జీవితాల్లో పెను తుఫానుని సృష్టించింది ఆ బిగ్ బాస్.
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అతనికి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత ఆమె పని ఆమెది, షణ్ముఖ్ పని షణ్ముఖ్ ది. అయితే దీప్తి సునయన యూట్యూబర్ గా షార్ట్ ఫిలిమ్స్ లోనే కాదు.. స్పెషల్ ఫొటోస్ తోనూ అద్భుతమైన గ్లామర్ తో అదరగొట్టేస్తుంది.
తాజాగా వైట్ కాస్ట్యూమ్స్ లో దీప్తి సునయన షేర్ చేసిన బ్యూటిఫుల్ గ్లామర్ పిక్స్ చూస్తే హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందం దీప్తి నీది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా దీప్తి సునయన ఆ వైట్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోసే ప్రయత్నమైతే గట్టిగానే చేసింది. మీరు కూడా దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి.