నిజంగా 2024 ఎలక్షన్ లో ఓడిపోవడమేమో కానీ.. జగన్ ని వెంటాడి వేధిస్తున్నది ఆయన చెల్లెలు షర్మిల. ఏ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలయ్యాయో ఏమో.. ఈ అన్నాచెల్లెళ్లు మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. అన్నకి వ్యతిరేఖంగా ఏపీలో షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగడుగునా అన్నకి అడ్డం పడుతుంది. జగన్ ఓటమిలో చంద్రబాబు-పవన్ ఎంత కీలక పాత్ర పోషించారో.. షర్మిల కూడా వైసీపీ ఓట్లు చీల్చి అన్న పతనానికి కారణమైంది.
ఇక ఏపీలో జగన్ ఏ సమస్య ఎత్తుకుని మీడియాలో హైలెట్ అవుదామా అని కాచుకుని కూర్చుంటే షర్మిల దానిని కూడా సాగనివ్వడం లేదు. జగన్ అసెంబ్లీకి హాజరవ్వకుండా తప్పించుకునే ప్రయత్నంలో సేవ్ డెమోక్రసీ.. అంటూ 11 మంది ఎమ్యెల్యేలతో అసెంబ్లీ గేటు వద్ద హడావిడి చేసాడు. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. అంటూ గళమెత్తాడు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డం పడ్డ జగన్ అండ్ కో.. గంట తిరక్కుండానే అసెంబ్లీ నుంచి జంప్.
అలా జగన్ ఇంటి కెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకున్నాడో, లేదో.. ఇలా ఆయన చెల్లి మీడియా ముందుకొచ్చేసింది. వినుకొండ ఘటనలో టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తని చంపేశాడు అంటూ జగన్ మాట్లాడాడు, అసలు అది పార్టీలకు సంబంధం లేని హత్య, వారిద్దరూ స్నేహితులు.. ఆ హత్య కోసం ఢిల్లీ పోయి ధర్నా చేస్తావా.. నువ్వు వర్షాలకు నష్టపోయిన వాళ్ళను పరామర్శించకుండా హత్యా రాజకీయాలు చేస్తున్నావంటూ చెడా, మడా ఏసుకుంది.
అంతేకాదు సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని, బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని, వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని, అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని, వినుకొండ హత్య వ్యక్తిగత హత్యేనని.. రాజకీయమైంది అంటూ జగన్ గాలి తీసేసింది.
ఏదో అసెంబ్లీలో మొదటిరోజు మీడియాలో హైలెట్ అవుదామని జగన్ ఏదో హంగామా ప్లాన్ చేస్తే.. షర్మిల ప్రెస్ మీట్ తో అది గాలిలో కలిసిపోయెలా చేసింది. పాపం జగన్.. ఈవిడొక్కట్టి చాలు ఆయన పరువు తియ్యడానికి అని అందరూ మాట్లాడుకుంటున్నారు.