కుర్ర హీరో కిరణ్ అబ్బవరం పెళ్ళికి సిద్దమయ్యాడు. కిరణ్ హీరోయిన్ రహస్యతో ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చ్ 13 న హైదరాబాద్ రిసార్ట్స్ లో రాజా వారు - రాణి వారు ఫేమ్ రహస్య గోరఖ్ తో నిశ్చితార్ధం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం బంధుమిత్రుల నడుమ కిరణ్ అబ్బవరం - రహస్య నిశ్చితార్ధం గ్రాండ్ గా జరగగా.. ఇప్పుడు వివాహం కూడా కేవలం ఇరు కుటుంబాల నడుమ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఆగష్టు 22 న కిరణ్ అబ్బవరం - రహస్యల వివాహం జరగబోతుంది. అయితే ఆ పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరం - రహస్యల వివాహం కేరళలో జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కిరణ్ అబ్బవరం డెస్టినేషన్ వెడ్డింగ్ ని ఎంచుకున్నాడు. కేరళ అందాల నడుమ కిరణ్ అబ్బవరం, రహస్య మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడవబోతున్నాడన్నమాట.
ఇక ఆగష్టు 22 న పెళ్లి కేరళలో జరిగితే.. హైదరాబాద్ లో ఆగస్టు 24 న సినిమా ప్రముఖులకు కిరణ్ అబ్బవరం-రహస్యలు గ్రాండ్ పార్టీ అంటే వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.