నేహా శెట్టి కొత్త ఫొటోస్ చూడగానే ఆమె అభిమానులు, నెటిజెన్స్ కామెంట్ చేసేది ఇదే.. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ ఇడియట్ లోని సాంగ్ ఏసుకోవడం ఖాయం. డీజే టిల్లు తర్వాత రాధికగా అందరి మనసుల్లో గుర్తుండిపోయే స్థానాన్ని సంపాదించుకున్న నేహా శెట్టి ఆ తర్వాత వచ్చిన రూల్స్ రంజన్, ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆమెని బాగా నిరాశపరిచాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా అందులో నేహా శెట్టికి అంతగా పేరు రాలేదనే చెప్పాలి. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందం అన్ని ఉన్న హీరోయిన్. కానీ బ్రేకిచ్చే హీరో మాత్రం నేహా శెట్టికి దొరకడం లేదు. మరి ఈ ఖాళీ సమయాన్ని నేహా శెట్టి ఫోటో షూట్స్ కోసం వాడేస్తుంది.
తాజాగా నేహా శెట్టి వదిలిన పిక్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. లైట్ కలర్ అవుట్ ఫిట్ లో నేహా శెట్టి మత్తెక్కిచే చూపులతో అద్దరగొట్టేసింది. కెమెరా తో క్లిక్ మనిపిస్తూ అద్భుతమైన అందాలు ప్రదర్శించింది. ప్రస్తుతం నేహా శెట్టి గ్లామర్ ఫొటోస్ షూట్ నెట్టింట సంచలనంగా మారింది.