బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలు కాబోతుంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ 8 పై అంచనాలు పెంచే ఏర్పాట్లు మొదలు పెట్టేసారు. ఇప్పటికే కమింగ్ సూన్ తో లోగో ని ఆవిష్కరించిన యాజమాన్యం.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రోమో వదిలింది. కమెడియన్ సత్య ఓ దొంగ.. అతను వస్తువులు ఎత్తుకెళ్లే సమయంలో కింగ్ నాగ్ ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటూ వదిలిన ప్రోమో వైరల్ అయ్యింది.
అంతేకాదు ఒకసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటూ నాగార్జున బిగ్ బాస్ 8 పై అందరిలో ఆసక్తి కలిగేలా చేసారు. మరి ఈసారి సెప్టెంబర్ కాదు ఈ నెల చివరి వారం నుంచే మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అందుకే నాగార్జున వరసగా బిగ్ బాస్ పై అంచనాలు పెంచే ప్రమోస్ తో వచ్చేస్తున్నారు. ఈ రోజు వదిలిన ప్రోమోలో నాగార్జున డిఫ్రెంట్ కాస్ట్యూమ్స్ లో సరదాగా కనిపించారు.
మరి ఈసారి క్రేజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. విష్ణు ప్రియా లాంటి గ్లామర్ డాల్స్, యూట్యూబ్ లో తెగ ఫేమస్ అయిన కుమారి ఆంటీ, వేణు స్వామి అలాగే సీరియల్ ఆర్టిస్ లు, యుట్యూబర్స్ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు బాగా వెయిట్ చేస్తున్నారు.