ఆర్కే రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. వైసీపీ ప్రభుత్వంలో జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాన్ని నోటికొచ్చిన పదజాలంతో దూషిస్తూ తెగ హైలెట్ అవడమే కాదు.. జగన్ భజన చేస్తూ రెండేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగింది. ఇక జగన్ అన్న గెలుస్తాడు, మళ్ళీ సీఎం గా జగన్ అన్న ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటూ గొప్పలు చెప్పిన రోజాకు ప్రజలు చుక్కలు చూపించారు.
నగరిలో రోజా ని ఓడించడానికి వైసీపి కార్యకర్తలే కీలకంగా పని చేసారు. అంతేకాదు వైసీపీ కూడా 2024 ఎలక్షన్ లో ఘోరంగా ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కనిపిస్తుంది. జగన్ అయితే చెప్పక్కర్లేదు బెంగుళూరు-తాడేపల్లి అప్ డౌన్ చేస్తున్నాడు. అదాలాఉంటే ఓటమి తర్వాత రోజాపై అధికార పక్షం వాళ్ళే కాదు, ప్రజలు కూడా సెటైర్స్ వేస్తున్నారు. ఓటమి తర్వాత పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి అంటూ జగన్ ని కలిసొచ్చింది రోజా.
ఆతరవాత రాజకీయాలు గురించి పక్కనపెట్టిన రోజా బుల్లితెర మీద బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈలోపు రోజా ఫ్యామిలీతో కలిసి ఇటలీ ట్రిప్ వేసింది. ఇటలీ ట్రిప్ లో కూతురు, కొడుకు, భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రోజా చిట్టిపొట్టి ఫ్రాక్స్ వేసుకుని అక్కడ కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
డ్రెస్సింగ్ స్టయిల్ అనేది ఎవరి ఇష్టం వారిది. కానీ రోజా గతంలో టీడీపీ నేత అనిత ఇంకా చాలామంది చుడీదార్స్ వేసుకున్న విషయంలో చేసిన కామెంట్స్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏంటి రోజా అప్పుడు అలా మాట్లాడిన నువ్వేనా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంది అంటూ సరదాగా ఏసుకుంటున్నారు.