ఇప్పుడు హీరో రామ్ vs రవితేజ కన్నా ఎక్కువగా హీరోయిన్స్ మద్యన గ్లామర్ పోటీ ఇంట్రెస్టిగ్ గా మారింది. ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున బాక్సాఫీసు దగ్గర పోటీపడబోతున్న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల్లో ఏది యాక్షన్ ప్యాకెడ్, ఏది రొమాంటిక్ మూవీ అనేది పక్కనపెడితే.. ఆ రెండు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన వారు అందాలు చూపించే విషయంలో పోటీ పడుతున్నారు.
రవితేజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ చిత్రంలో అందాల విందు చేస్తుంది. మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే కేరెక్టర్ ని హరీష్ శంకర్ గ్లామర్ గా ప్లాన్ చేశాడా అనేలా మిస్టర్ బచ్చన్ సాంగ్స్ లో ఆమె అందాలు హైలెట్ అవుతున్నాయి. ట్రైలర్ కౌన్ డౌన్ పోస్టర్ లోను భాగ్యశ్రీ కి రవితేజ్ ఘాటైన ముద్దు పెడుతున్న పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ కావ్య థాపర్ కూడా డబుల్ ఇస్మార్ట్ సాంగ్స్ లోనే కాదు ట్రైలర్లోనూ అందాల విందు చేసింది. తాను బోల్డ్ కేరెక్టర్ లో కనిపిస్తానని డబుల్ ఇస్మార్ట్ ఇంటర్వ్యూలో కూడా చెబుతుంది. సినిమా ప్రమోషన్స్ లోను కావ్య థాపర్ గ్లామర్ గా దర్శనమిస్తుంది. డబుల్ ఇస్మార్ట్ లో యాక్షన్ ఎంతగా హైలెట్ అవుతుందో కావ్య థాపర్ అందాలు అంతే హైలెట్ అవుతాయనడంలో సందేహం లేదు.
అందుకే అనేది ఆగష్టు 15 న మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందాలు vs డబుల్ ఇస్మార్ట్ కావ్య థాపర్ అందాలు అన్నట్టుగా ఉంది ఈ పోటీ. మరి ఇలాంటి పోటీ అంటే యూత్ కి పండగేగా..!