నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా అల్లు అరవింద్ ఆహా ఓటీటీ లో ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలయ్యలో మరో కోణాన్ని ఈ టాక్ షో బయటికి తీసింది. అంతేకాదు.. స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ లు ఈ షోకి అటెండ్ అయ్యి బాలయ్యతో సరదాగా మాట్లాడడం హైలెట్ అయ్యింది.
అయితే సెకండ్ సీజన్ విషయంలో ఆహా వాళ్ళు ఫెయిల్ అయ్యారనే విమర్శలొచ్చాయి. ఈ సీజన్ కి అనుకున్న గెస్ట్ లను తీసుకురాలేకపోవడంతో ఈ సీజన్ పై క్రేజ్ తగ్గింది అనే మాటలు వినిపించాయి. ఆ తర్వాత మూడో సీజన్ విషయంలో ఇదిగో అదిగో అన్నప్పటికి ఆ సీజన్ ఇంకా మొదలు కాలేదు. తాజాగా దసరా నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలు కాబోతుంది అంటున్నారు.
దానితో గత రెండు సీజన్ కి మెగాస్టార్ చిరంజీవి బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ కి వస్తారనే ప్రచార జరగడంతో ఇరువురు అభిమానులు వీరి కలయిక కోసం వేయి కళ్ళతో ఎదురు చూసారు. కానీ మెగాస్టార్-బాలయ్య కలయిక ఆ రెండు సీజన్ లో అసాధ్యమయ్యింది. దాంతో మూడో సీజన్ కైనా చిరంజీవి వస్తారా అనే అనుమానం అందరిలో మొదలైంది.
బాలయ్య ఇటు NBK 109 షూటింగ్ లో ఉంటే మెగాస్టార్ అటు విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు. మరి వీరి కలయిక ఆహా టాక్ షోలో ఎప్పటికి సాధ్యమయ్యేనో చూద్దాం.