Advertisementt

ట్రైలర్: సరిపోదా.. నాని శివతాండవం!

Thu 15th Aug 2024 11:25 PM
saripodhaa sanivaaram trailer  ట్రైలర్: సరిపోదా.. నాని శివతాండవం!
Saripodhaa Sanivaaram Trailer Talk ట్రైలర్: సరిపోదా.. నాని శివతాండవం!
Advertisement
Ads by CJ

ఇప్పటిదాకా వాడి రెండు కళ్లే చూశారు.. మూడో కన్ను చూశారో, శివతాండవమే.. సరిపోదా శనివారం సినిమాలో నాని పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ట్రైలర్‌ను మంగళవారం, హైదరాబాద్ సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ సినిమా రేంజ్ ఇదని చాటేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

నా సహనం నశించింది.. నా కన్నీళ్లు ఇంకిపోయాయ్, అందుకే మనందరి తరపున భయాన్ని దాటే ఒకడుగు ముందుకు వేద్దాం అనుకుంటున్నాను అంటూ ఓ ఛైల్డ్ వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి‌గా సిఐ దయానంద్ (ఎస్. జె. సూర్య) పాత్రని పరిచయం చేసిన తీరు, ఆ పాత్రని ఎదుర్కోవడానికి సూర్య (నాని) ఎంట్రీ ఇచ్చిన విధానం, సూర్య పాత్రకి తండ్రి (సాయికుమార్) ఇచ్చే ఎలివేషన్.. హైలెట్ అనేలా ఉన్నాయి. శుభలేఖ సుధాకర్, ప్రియాంక మోహన్ పాత్రలతో ట్రైలర్ నడిపించారు. వివేక్ ఆత్రేయ ఈ ట్రైలర్‌తోనే పూర్తి కథని రివీల్ చేసినప్పటికీ.. సినిమా చూడాలనే ఇంట్రస్ట్‌ని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు.

ఎస్‌జె సూర్య తన నటనతో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళతాడనే ఇంపాక్ట్‌ని ఈ ట్రైలర్ కలిగిస్తోంది. అలాగే సూర్యగా నాని పాత్ర, పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సరికొత్తగా ఉన్నాయి. సోకులపాలెం అనే ఊరి కోసం సూర్య ఎలా నిలబడ్డాడనేదే ఈ సినిమా. అలాగే ప్రతి శనివారం సూర్య ఇచ్చే ట్రీట్‌మెంట్ ఈ సినిమాకు ప్రధానబలం కావడంతో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఈ ట్రైలర్‌తో ఇచ్చేశారు మేకర్స్. మొత్తంగా నాని కెరీర్‌లో మరో మంచి ఫిల్మ్ రాబోతుందనే ఇంపాక్ట్‌ని అయితే ఈ ట్రైలర్ ఇస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ చిత్రం.. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.

Saripodhaa Sanivaaram Trailer Talk:

Nani Saripodhaa Sanivaaram Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ