Advertisementt

కావ్య థాపరా? భాగ్యశ్రీ బోర్సేనా?

Fri 16th Aug 2024 08:45 AM
kavya thapar vs bhagyashri borse  కావ్య థాపరా? భాగ్యశ్రీ బోర్సేనా?
Kavya Thapar vs Bhagyashri Borse కావ్య థాపరా? భాగ్యశ్రీ బోర్సేనా?
Advertisement
Ads by CJ

ఆగస్ట్ 15న మాస్ మహారాజా రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేనిల మధ్య బీభత్సమైన ఫైట్ జరగబోతోంది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ డైరెక్టర్ అయితే.. రామ్ డబుల్ ఇస్మార్ట్‌కు హరీష్ గురువు పూరి దర్శకుడు. అంటే గురు శిష్యుల మధ్య పోటీ అన్నమాట. అయితే ఇద్దరూ కూడా దీనిని పోటీ అని అనుకోకుండా స్పోర్టివ్‌గా తీసుకోవడం గొప్ప విషయం. అయితే ఈ రెండు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. చూస్తుంటే సంక్రాంతి రిపీట్ అన్నట్లుగా ఉంది బాక్సాఫీస్ వ్యవహారం. మరి ఈ ఫైట్‌లో ఎవరు ఫైనల్ విన్నర్ అనేది.. ఇండిపెండెన్స్ డే డిసైడ్ చేయనుంది.

మరోవైపు మాస్ రాజాకి హిట్ కావాలి? అలాగే రామ్ కి కూడా హిట్ కావాలి? హరీష్ శంకర్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా.. పూరీ నుంచి భారీ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమాలు కావడంతో.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మధ్య పోటీ మాములుగా ఉండదనేలా అప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక వీరితో పాటు ఇందులో చేస్తున్న హీరోయిన్ల విషయంలో కూడా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తుండటం విశేషం. 

డబుల్ ఇస్మార్ట్‌లో నటించిన కావ్య థాపర్ ఇప్పటికే పరిచయమైన నటి. అలాగే బోల్డ్ బ్యూటీగానూ మంచి మార్కులు వేయించుకుంది. ఇటీవల వచ్చిన విజయ్ ఆంటోని సినిమాలో బీభత్సంగా అందాలు ఆరబోసి.. నేను చాలా హాట్ గురూ అని అనిపించుకున్న నటి. అయితే ఆమె నుంచి కొత్తగా పూరి ఏం చూపిస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇక హరీష్ పరిచయం చేయబోతోన్న బచ్చన్ పోరి భాగ్యశ్రీ బోర్సే మాత్రం ఇప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఫ్రెష్ బ్యూటీ. అందానికి అందం, అణుకువ అన్నీ ఉన్నట్లుగా కనిపిస్తున్నా.. స్టేజ్ మీద వీర మాస్ స్టెప్పులతో నాలోనూ మాస్ ఉందని నిరూపించుకుంటుంది. అలాగే ఇప్పటి వరకు వచ్చిన మిస్టర్ బచ్చన్ పాటల్లో ఆమె అందాన్ని చూసిన వారంతా.. ఇండస్ట్రీని ఏలే మరో హీరోయిన్ వస్తోంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారంటే.. ఈ పోటీలో భాగ్యశ్రీ ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అలా అనీ కావ్యని తీసేయలేం. పూరి మ్యాజిక్ పని చేసిందంటే మాత్రం కావ్య కూడా బాక్సాఫీస్‌ని కెలికేయడం కాయం. చూద్దాం మరి కావ్యానా? భాగ్యశ్రీనా? అనేది..

Kavya Thapar vs Bhagyashri Borse:

Mr Bachchan Beauty vs Double Ismart Beauty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ